Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెయిన్ కిల్లర్స్... పెయిన్ పోతుంది కానీ కొత్త పెయిన్ ఖాయం....

దేహంలో ఎక్కడైనా పట్టేసినట్లు అనిపిస్తే చాలు వెంటనే పెయిన్ కిల్లర్ మాత్ర తెచ్చుకుని వేసేసుకుంటుంటారు చాలామంది. ఐతే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల తాత్కాలికంగా నొప్పి తగ్గినప్పటికీ వేరు దుష్ఫలితాలు తలెత్తుతాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఈ పెయిన్ కి

Webdunia
శనివారం, 16 ఏప్రియల్ 2016 (16:42 IST)
దేహంలో ఎక్కడైనా పట్టేసినట్లు అనిపిస్తే చాలు వెంటనే పెయిన్ కిల్లర్ మాత్ర తెచ్చుకుని వేసేసుకుంటుంటారు చాలామంది. ఐతే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల తాత్కాలికంగా నొప్పి తగ్గినప్పటికీ వేరు దుష్ఫలితాలు తలెత్తుతాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్‌ను వాడేవారిలో అల్సర్, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. 
 
కడుపులో మంట, నొప్పి, వాపు, కండరాలు, ఎముకలకు సంబంధించిన వ్యాధుల నివారణకు నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లామెటరి డ్రగ్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారనీ, ఈ మందులు వాడినప్పుడు సదరు సమస్య తగ్గినప్పటికీ కొత్త సమస్య పట్టుకుంటుందని చెపుతున్నారు. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల గుండెపోటు కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు. 
 
కనుక వైద్యులను సంప్రదించకుండా నొప్పి తగ్గేందుకు పెయిన్ కిల్లర్స్ వాడటం చాలా ప్రమాదకరం అని చెపుతున్నారు. కానీ వైద్యుల సలహా లేకుండా చాలామంది నొప్పులు తగ్గేందుకు మందుల షాపులో పెయిన్ కిల్లర్స్ కొనేసి వేసేసుకుంటున్నారనీ, దీనివల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు హెచ్చరిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments