Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన కొత్తలో భార్యను వేధించే ఆ సమస్య

సాధారణంగా పెళ్లయిన కొత్తలో శృంగారంలో పాల్గొన్న యువతిలో ఆనందం కంటే నొప్పి, బాధ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పెళ్లయిన కొత్తలో పూర్తి స్థాయిలో శృంగారంలో పాల్గొనలేరు. ఈ సమస్యను వైద్య పరిభాషలో మూత్రనాళ ఇన్ఫె

Webdunia
సోమవారం, 10 జులై 2017 (17:53 IST)
సాధారణంగా పెళ్లయిన కొత్తలో శృంగారంలో పాల్గొన్న యువతిలో ఆనందం కంటే నొప్పి, బాధ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పెళ్లయిన కొత్తలో పూర్తి స్థాయిలో శృంగారంలో పాల్గొనలేరు. ఈ సమస్యను వైద్య పరిభాషలో మూత్రనాళ ఇన్ఫెక్షన్‌గా పిలుస్తారు. ఇది స్త్రీలకే ఎక్కువగా వస్తుంది. సరైన సమయంలో గుర్తించి చికిత్స ఇవ్వకపోతే ఇది మూత్రాశయానికి, కిడ్నీలకు పాకే అవకాశం ఉంది. 
 
ఈ సమస్య లక్షణాలను ఒకసారి పరిశీలిస్తే... మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి రావడం,  కొన్నిసార్లు రక్తపు చారలు ఉండటం, బొడ్డు కింది పొత్తి కడుపు కింది భాగంలో నొప్పి, 100 నుంచి 104 డిగ్రీల వరకూ జ్వరం, ఒళ్లు నొప్పులు, చలి వచ్చినట్టు ఉంటుంది. 
 
ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా ఈ-కొలి అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుందని వైద్యులు చెపుతున్నారు. భర్త భార్యతో సంభోగంలో పాల్గొన్న తర్వాత ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అపరిశుభ్రమైన వేళ్లు లేదా పురుషాంగం పెద్ద పేగు చివరి భాగమైన పాయువు లేదా మలం ద్వారంను తగిలి అక్కడి నుంచి యోనిలోకి ప్రవేశించవచ్చని వైద్యులు చెపుతున్నారు. 
 
సాధారణంగా ఈ-కొలి బ్యాక్టీరియా మూత్రద్వారంలోకి ప్రవేశించిన ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ లక్షణాలు బయటపడతాయి. మూత్రపరీక్ష, మూత్ర కల్చర్ ద్వారా మూత్రంలో పస్‌సెల్స్, బాక్టీరియా కన్పిస్తాయి. ఈ సమస్యతో బాధపడే వారు తక్షణం నిపుణులైన వైద్యుడుని సంప్రదించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం