Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేరియా వ్యాధి... ఎలా నిరోధించాలి?

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (10:08 IST)
జ్వరం కొద్దిగా ఉండి ఒక్కసారిగా చలితో జ్వరం వస్తుంది. ప్రారంభమున శరీరం చల్లగానే ఉండి ఆకస్మాత్తుగా పొగలుగ్రక్కే వేడి చేస్తుంది. చల్లని దశలో వణుకు మొదలవుతాయి. చలి వణుకు ఉన్నప్పుడు జవ్రం 104 డిగ్రీల ఫారన్‌హీట్ నుండి 105 డిగ్రీల ఫారన్ హీట్‌కు పెరుగుతుంది. ఇది ఒకవేళ 106 డిగ్రీల ఫారన్‌హీట్ పెరిగితే రోగి గందరగోళంగా మారుతాడు. 
 
ఈ స్థితిలో విపరీతమైన జ్వరం, వణుకు, చలి, తలనొప్పి, శరీర నొప్పులు, వాంతులు ఉండి 4-5 గంటల తర్వాత జ్వరం, వణుకు తగ్గి చమటతో శరీరం నిండి పోతుంది. జ్వరం, చలి, తలనొప్పి రోజు విడిచి రోజు కాని, రెండు రోజులకు కాని రావొచ్చు. నోరు చేదుగా ఉండి, ఆహారం తినడానికి ఇష్టపడరు. రోగని పరీక్ష చేసినప్పుడు ప్లీహం వాపు ఉంటుంది. రక్తపరీక్ష ద్వారా మలేరియా తెలుస్తుంది. 
 
చికిత్స: రోగికి విశ్రాంతి ఇవ్వాలి. రోగికి కాచి చల్లార్చిన నీరు బాగా తాగడానికి ఇవ్వాలి. 
 
జ్వరం నందు ఉపయోగించు ద్రవ్యాలు:
1. ఉసిరి, కరక్కాయ, తానికాయ, తిప్పతీగె, వాసా కషాయం కాచుకుని 20-30 మి.లీ. సేవించిన విష జ్వరం తగ్గుతుంది. సుదర్శన ఘనవటి 500 మి.గ్రా. బిళ్ళలు పూటకు రెండు చొప్పున వాడాలి. 
 
2. శొంఠి, కిరాతతిక్త, త్రిఫలా, గుడూచి, ఆమలకీ, ముస్తా, తులసి మొదలగువానిని సమభాగాలుగా తీసుకుని కషాయం కాచి సేవించిన మలేరియాలో ఉపయుక్తంగా ఉండును. 
 
3. గూడూచి కషాయం 3 మి.లీ. సాయంత్రం సేవించిన విష జ్వరంలో ఉపయుక్తంగా ఉంటుంది. రక్తచందన, గూడూచి, శొంఠి సమాన భాగాలు గ్రహించిన కషాయం కాచి 20-30 మి.లీ. రోజుకు 3 సార్లు సేవించిన విష జ్వరం హరిస్తుంది. 
 
4. పాలు, రొట్టె, పండ్లరసాలు, మెత్తగా, గుజ్జులా చేసిన ఆహారపు ఊట, కిచిడి మొదలగునవి ఇవ్వవచ్చును. తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments