Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లటి కూరగాయలు తీసుకోండి.. ఇమ్మునిటీ పెంచుకోండి!

Webdunia
మంగళవారం, 24 జూన్ 2014 (15:18 IST)
తెల్లటి కూరగాయలు తీసుకోండి.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోండి.. అంటున్నారు న్యూట్రీషన్లు. పచ్చని కూరగాయలను తీసుకోవడంతో పాటు తెలుపు రంగు కూరగాయలను కూడా డైలీ డైట్‌లో చేర్చుకుంటే ఇమ్మునిటీ పెరుగుతుందని వారంటున్నారు. తెలుపు రంగు కూరగాయలంటే క్యాలీఫ్లవర్, బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, వెల్లుల్లి. 
 
ఈ నాలుగింటిని వారానికి రెండు మూరు సార్లైనా తప్పకుండా తీసుకోవాలి. తెల్లటి క్యాలీఫ్లవర్‌లో సల్ఫర్ అత్యధికంగా లభిస్తుంది. తద్వారా క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. ఎముకల్లోని టిష్యూను అభివృద్ధి చేస్తుంది. రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో, చలికాలంలో జ్వరం, దగ్గులను రాకుండా నిరోధిస్తాయి. వీటిని ఎంత వీలైతే అంత కూరల్లో వేసుకుని తినొచ్చు. ఇక పీచుపదార్థం, పొటాషియం కావాలంటే బంగాళాదుంపల్ని తినాలి. ఇందులోని విటమిన్ సి, విటమిన్ బి 6 శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
ఇక తెల్లటి పుట్టగొడుగుల్లో తక్కువ క్యాలరీలు, కొవ్వు ఉంటుంది. సోడియం, సెలీనియం, పొటాషియం, విటమిన్ డిలు పుట్టగొడుగులతో పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల బరువు తగ్గుతారని న్యూట్రీషన్లు చెబుతున్నారు. 

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments