Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీ నడుం చుట్టు కొలత 34.6 అంగుళాలు దాటితే 'చక్కెర' ఉన్నట్టే!

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (15:06 IST)
ఒక వ్యక్తికి మధుమేహ వ్యాధి (చక్కెర) ఉందో లేదో తెలుసుకునేందుకు నడుం చుట్టుకొలతతో గ్రహించవచ్చని బ్రిటన్‌కు చెందిన ఆరోగ్య విభాగ అనుబంధ సంస్థ పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ వెల్లడించింది. సాధారణ వ్యక్తుల కంటే కూడా నడుం చుట్టూ ఎక్కువ కొవ్వు కలిగి ఉన్న వ్యక్తులే ఐదు రెట్లు అధికంగా టైప్ 2 డయాబెటిస్ వ్యాధి బారిన పడతారని తెలిపింది. 
 
పురుషుల్లో నడుం చుట్టుకొలత 40 అంగుళాల కంటే ఎక్కువ ఉన్నవారు టైప్ 2 మధుమేహం బారిన పడే అవకాశం అధికమని, మహిళల్లో నడుం చుట్టుకొలత 34.6 అంగుళాలు దాటితే ప్రమాద ఘంటికలు మోగినట్టేనంటున్నారు. ప్రస్తుతం టైప్ 2 డయాబెటిస్ బాధితుల్లో 90 శాతం మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నవారే. ఈ ముప్పు తప్పించుకోవడానికి బరువు తగ్గడం ఒకటే మార్గమని, అయితే, ఆరోగ్యకరమైన రీతిలోనే డైటింగ్ చేయాల్సి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments