Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారానికి 11/2 కిలోల టమోటా తింటే.. పురుషుల్లో..?

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (18:22 IST)
టమోటాను ప్రతిరోజూ ఆహారం ద్వారా తీసుకోవడం ద్వారా పురుషుల్లో  ఏర్పడే టైప్-2 ప్రోస్టేట్ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బ్రిటీష్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో సుమారుగా ఒక వారానికి దాదాపు ఒకటిన్నర కిలోల టమోటాను ఆహారంలో చేర్చుకునే పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఏర్పడే ప్రమాదం చాలా తక్కువని తేలింది. టమోటా ఆహారంగా తీసుకునే వారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ 20 శాతం తగ్గించే అవకాశమున్నట్లు పరిశోధనలో తేలింది.  
 
ప్రపంచ వ్యాప్తంగా పురుషులకు ఏర్పడే రెండో అతిపెద్ద వ్యాధి అయిన ప్రొస్టేట్ క్యాన్సర్ కణాల వృద్ధిని టమోటాలు నిర్మూలిస్తాయని పరిశోధకులు తెలిపారు. బ్రిటన్‌లోని పురుషుల్లో 35వేల మందికి ఈ క్యాన్సర్ ముప్పు తప్పలేదని, వీరిలో 10వేల మంది ఈ క్యాన్సర్ ద్వారా ప్రాణాలు కోల్పోయారని పరిశోధకులు తెలిపారు.  
 
సాధారణంగా క్యాన్సర్‌ నుంచి తప్పించుకోవాలంటే కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అలాగే టమోటాలను కూడా ఆహారంలో చేర్చుకుంటే క్యాన్సర్ కణితులను తొలగిస్తుందని వారు చెబుతున్నారు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే మాంసం, వ్వు పదార్థాలు, ఉప్పు తగ్గించాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments