Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేయాకు తాగడం వల్ల కలిగే లాభాలేంటి?

Webdunia
బుధవారం, 30 జులై 2014 (13:22 IST)
టీ త్రాగడం వల్ల ఆ ఆకులో వున్న పోషక విలువలు శరీరానికి లభ్యమవుతాయి. తేయాకులో కార్బోహైడ్రేట్‌, ఖనిజాలు లభిస్తాయి. విటమిన్‌ ఎ,బి,సి,ఇ,కె కూడా ఉంటాయి. కాపర్‌, ఐరన్‌,జింక్‌, మాంగనీస్‌ టీలో లభిస్తాయి. ఇందులో కెఫిన్‌, పాలిఫినాల్స్‌ కూడా ఉంటాయి. టీ త్రాగడం రుచికేకాక శరీరారోగ్యానికి కూడా మంచిది. టీలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. రోజుకు 2,3 కప్పుల టీని త్రాగితే శరీరానికి ఎలాంటి హాని జరగదు.
 
* టీ త్రాగడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలుంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియ బాగుంటుంది.
* మానసిక శారీరక అలసటను తొలగిస్తుంది.బ్లాక్‌ టీ రక్తంలోని కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.
* నాడి వేగం పెరగకుండా నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
* ఆస్తమా, రోగులు టీ త్రాగడంవల్ల చక్కని ఫలితముంటుంది.కడుపులో మంటను తగ్గిస్తుంది. 
 
* మెదడును ఉత్తేజితం చేసి పనులను ఉత్సాహంగానూ, చురుకుగానూ చేయించ గలుగుతుంది. మలేరియా, ప్లూ జ్వరాలకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. మూత్రం సాఫీగా పోయేందుకు తోడ్పడుతుంది.
* మెదడులో రక్తప్రసరణ చక్కగా జరిగేలా చేస్తుంది. మెదడుకు చురుకుదనం కలిగిస్తుంది.
 
* టీ త్రాగడంవల్ల క్యాన్సర్‌ వ్యాధి ఏర్పడే అవకాశం తక్కువని డాక్టర్లు నిర్ధారించారు.నిద్రమత్తును, సోమరితనాన్ని తొలగిస్తుంది. 
* టీ త్రాగడం వల్ల గుండెపోటుకు గురికాకుండా కాపాడుతుంది. టీలో నిక్షిప్తమైన ప్లేవనోయిడ్స్‌ రక్తాన్ని గడ్డకట్టనీయకుండా కాపాడుతుంది.
 
* టీలో అల్లం ముక్కను చితక్కొట్టివేసి ఆ టీని త్రాగితే అరుచిని పోగొట్టి నోటి హితవును కలిగిస్తుంది. అజీర్ణ సమస్యలను పోగొడుతుంది. గరం మసాలా టీ త్రాగితే జలుబు, గొంతు నొప్పి తగ్గిపోతాయి. గొంతు గరగర నుంచి కాపాడుతుంది. అయితే మితంగా తాగడమే మంచిది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments