Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలుష్యంతో నగర జీవి మెదడుకు దెబ్బే..!

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (18:33 IST)
దేశంలో గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలుగానూ, పట్టణ ప్రాంతాలు నగరాలుగానూ, నగరాలు మహా నగరాలు గానూ దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఈ అభివృద్ధి మంచిదే. అయితే, జనాభా పెరుగుతున్న కొద్దీ కాలుష్యం కూడా భారీగా పెరిగిపోతుంది. గాలితో పాటు నీరు కలుషితం కావడంతో పాటు భూ పర్యావరణం (గ్లోబర్ వార్మింగ్) సైతం వేడెక్కిపోతోంది. 
 
ముఖ్యంగా నగరాల్లో కాలుష్య ప్రభావం అంతా ఇంతా కాదు. అందుకే నగర వాసులు గాలి కాలుష్యంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాలి కాలుష్యంతో మెదడుకు దెబ్బేనని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా గాలి కాలుష్యంతో మెదడుకు సంబంధిత వ్యాధులు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 
 
ఎలుకలపై నిర్వహించిన టెస్టుల్లో కలుషితమైన గాలిని పీల్చడంలో శారీరకంగా కొన్ని మార్పులు చోటు చేసుకోవడంతో పాటు, మెదడు సంబంధించి నెగటివ్ ఫలితాలు వచ్చాయని ఓహియో స్టేట్ యూనివర్శిటీ స్టడీలో తేలింది. గాలి కాలుష్యంతో గుండె, ఊపిరితిత్తులకు ప్రమాదమని ఇంతకుముందు నిర్వహించిన సర్వేలో తేలగా, మొట్టమొదటి సారిగా గాలి కాలుష్యంతో మెదడుకు సంబంధిత వ్యాధులు సోకుతాయని తేలింది. పట్టణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో బసచేసే వారికే గాలి కాలుష్యంతో ప్రమాదం ఎక్కువని ఫాకెన్ చెప్పారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments