Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారం ఎక్కువ వద్దండోయ్.. దంచిపారేయకండి..!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (18:55 IST)
మనోళ్లకి కారం లేకుంటే ముద్ద దిగదు. అయితే కారం మాత్రం ఆరోగ్యానికి అంత మంచిది కాదని పరిశోధకులు అంటున్నారు. కారాన్ని పరిమితంగా గాకుండా.. ఎడాపెడా లాగించేశారంటే.. తర్వాతే కష్టాలేనని వారు హెచ్చరిస్తున్నారు. 
 
ఆంధ్ర మిర్చిలో ఘాటు వుంటుందనే అందరికీ తెలిసిందే. అయితే కాశ్మీర్ మిర్చిలో ఘాటుండదు. కానీ ప్రపంచంలో అధిక కారముండే మిరపకాయలు గ్వాలియర్‌లో ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.  
 
అధిక కారంతో తయారైన వంటకాలు ఆరోగ్యంతో పాటు కడుపుకు చేటు కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విదేశాల్లో మిరపకాయలకు బదులు మిరియాలు ఉపయోగిస్తారు. 
 
కానీ మిర్చిని కూరల్లో దంచిపారేసి.. లొట్టలేసుకుని తినడం ద్వారా ఒబిసిటీ తప్పదని పరిశోధకులు అంటున్నారు. కారాన్ని తగ్గిస్తే బరువు తగ్గుతారని వారు సూచిస్తున్నారు. 
 
కారంగా ఉన్న వంటకాలను తీసుకోవడం ద్వారా శరీరంలోని ఉష్ణం అధికమవుతుందని, తద్వారా స్థూలకాయం తప్పట్లేదు. కారం తినేటప్పుడు నీరు అధికంగా సేవించడం చేస్తారు. అలాగే కారాన్ని ఎక్కువగా తీసుకుంటే అంతే ఎక్కువగా ఆకలి ఉంటుందని తద్వారా ఒబిసిటీకి దారితీస్తుంది. కారం మితంగా తీసుకునేవారిలో ఊబకాయం తక్కువే.  
 
మనం తీసుకునే ఆహారంలో ఉప్పు, తీపు, కారం, పులుపు అన్నీ మితంగా ఉంటే ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments