Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ పీస్ బెనిఫిట్స్ అండ్.. చిల్లీ బఠాణీ మష్రుమ్ రిసిపీ మీ కోసం..!

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (17:18 IST)
గ్రీన్ పీస్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి. గ్రీన్ పీస్‌ల వంటకాలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చిబఠాణీల్లో ఉన్న పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వారు సూచిస్తున్నారు. 
 
బఠాణీలను ఉడికించి సూప్ లేదా సలాడ్స్ రూపంలో తీసుకోవడం ఉత్తమం. ఇంకా మటన్, చికెన్, ఉడికించిన గుడ్లతో తయారు చేసిన వంటకాల్లోనూ జతచేసుకోవచ్చు. పిల్లలకు పచ్చి బఠాణీలు, క్యారెట్ కాంబినేషన్‌లో తయారయ్యే రిసిపీలను ఇవ్వొచ్చు.
 
గ్రీన్ పీస్‌లో శరీరానికి కావలసిన పోషకాలున్నాయి. విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్లు ఉన్నాయి. ఇతర బీన్స్ కంటే బఠాణీల్లో కెలోరీలు తక్కువ. 100 గ్రాముల పచ్చి బఠాణీల్లో 81 గ్రాముల కెలోరీలున్నాయి. కొలెస్ట్రాల్ ఉండదు. పీచు కలిగివుంటుంది. ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. 
 
ఈ ఫోలిక్ యాసిడ్ గర్భిణీ మహిళలకు, చిన్నారులకు చాలా ఆవశ్యకం. అందుచేత పిల్లలు బఠాణీలు తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని విటమిన్ కె, సి, ఎ ఆరోగ్యానికి శక్తినిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి.  
 
అలాంటి సూపర్ బెనిఫిట్స్ కలిగిన పచ్చి బఠాణీలతో చిల్లి మష్రుమ్ యాడ్ చేసి రెసిపీ చేస్తే ఎలా వుంటుందో చూద్దాం.. 
 
పచ్చి బఠాణీలు - ఒక కప్పు, మష్రూమ్- అరకప్పు, బటర్- ఒక టేబుల్ స్పూన్, ఉల్లి తరుగు- అర కప్పు, మైదా- ఒక టేబుల్ స్పూన్, చిక్కటి పాలు -100 గ్రాములు, ఉప్పు- మిరియాలు తగినంత. 
 
తయారీ విధానం : ముందుగా మరిగే నీటిలో ఉప్పు, బఠాణీలను చేర్చి ఐదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఆ నీటిని వడగట్టి పక్కన బెట్టుకోవాలి. తర్వాత మరో ప్యాన్‌లో వెన్నను వేడి చేసి ఉల్లి తరుగును చేర్చి ఫ్రై చేసుకోవాలి. 
 
తర్వాత మష్రూమ్స్‌ను కలపాలి. ఇందులో మైదాను జారుగా కలుపుకుని బఠాణీలు చేర్చి పాలు చేర్చి ఉడికించాలి. ఉప్పు, మిరియాలు చేర్చి గడ్డ కట్టకుండా గట్టిపడేంతవరకు ఉడికించాలి.. అంతే చిల్లీ బఠాణీ మష్రుమ్ రెడీ. దీనిని టోస్ట్ చేసిన బ్రెడ్‌తో సర్వ్ చేస్తే టేస్టీగా ఉంటుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments