Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయంత్రం 4 to 5 ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి?

Webdunia
గురువారం, 19 ఫిబ్రవరి 2015 (19:10 IST)
పుల్లటి పండ్లను జ్యూస్‌గా తీసుకోవడం మంచిది. తియ్యటి పండ్లను అలాగే తినడం మంచిది. బత్తాయి, నారింజ, కమలా, అనాస మొదలైన వాటిని రసంగా తీసుకోవాలి. ఆ రసంలో పంచదారం, బెల్లం, వేయకుండా 2 లేదా 3 స్పూన్ల తేనె వేసుకోండి. రసాలలో ఎప్పుడూ ఐస్ వాడకూడదు. నారింజ రసం రోజూ తాగడం మంచిది. రోడ్లపై అమ్మే వాటికంటే ఇంట్లోనే తయారు చేసే జ్యూస్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
 
ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య కాలంలో తేలికగా జీర్ణమయ్యే, త్వరగా శక్తినిచ్చే పండ్లను తినడం మంచిది. షుగర్ వ్యాధి ఉన్నవారు జామ, దానిమ్మ, బత్తాయి, నారింజ, పుల్లటి రేగి కాయలు, నేరేడుపండ్లు తింటే షుగరు పెరగదు. బరువు తగ్గవలసిన వారు అరటిపండ్లను మానండి. 
 
మామిడి, సపోటా, సీతాఫలం, పనసతొనలు వాటిని ఎక్కువగా తినదలచినప్పుడు సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో సరిపడా తిని ఆ రోజు భోజనం మానండి. ఖరీదైన పండ్లు కొనలేని వారు రోజూ సాయంత్రానికి స్నాక్స్‌గా తీసుకునే రెండేసి జామకాయలు తిన్నా సరిపోతుంది. అయితే అందులో ఉప్పు కారం మాత్రం ఉండకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments