Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తిమీర, అల్లం, జీలకర్ర, మెంతులు, పసుపులో ఏమున్నాయ్?

Webdunia
సోమవారం, 18 ఆగస్టు 2014 (15:46 IST)
కొత్తిమీర, అల్లం, జీలకర్ర, మెంతులు, పసుపులో ఏమున్నాయో తెలుసా? అయితే  ఈ కథనం చదవండి. మనం నిత్యం వంటల్లో ఉపయోగించే ఈ ఐదింటిలో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కొత్తిమీర :
కొత్తిమీర, ధనియాలను వంటల్లో చేర్చుకోవడం ద్వారా అజీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు. శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ సంబంధిత రోగాలు, చర్మ వ్యాధులను నయం చేసుకోవచ్చు. వేవిళ్ళను దూరం చేసుకోవాలంటే ధనియాల పొడి కషాయాన్ని తాగితే ఉపశమనం లభిస్తుంది.  
 
అల్లం: 
అల్లం ఆహారానికి రుచినివ్వడంతో పాటు జీర్ణ సమస్యలను సైతం నయం చేస్తుంది. కఫం, వాతంను దూరం చేస్తుంది. జలుబు, దగ్గును నయం చేయడంలో అల్లంకు మించిన వైద్యం లేదు. 
 
జీలకర్ర: 
యాంటీ-బ్యాక్టీరియల్‌గా పనిచేసే జీలకర్రను వంటల్లో చేర్చుకోవడం ద్వారా అజీర్ణ సమస్యలను దరిచేరవు. కిడ్నీ సంబంధిత వ్యాధుల్ని నివారిస్తుంది. 
 
మెంతులు :
మెంతులు కూడా శ్వాసకోశవ్యాధులు, అజీర్తిని దూరం చేస్తుంది. నరాల బలహీనత, నెలసరి సమస్యలను దూరం చేస్తుంది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా బరువును తగ్గిస్తుంది. రాత్రి నానబెట్టిన మెంతుల నీటిని తాగడం ద్వారా రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. 
 
ఇక పసుపు గురించి..
టైప్-2 డయాబెటిస్‌ను దూరం చేసే పసుపు.. ఇన్సులిన్ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. అలెర్జీలను దూరం చేస్తుంది. ఇందులోని యాంటీ- యాక్సిడెంట్లు శరీరంలోకి క్రిములను నశింపజేస్తుంది. ఇంకా రక్తాన్ని శుద్ధీకరిస్తుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments