Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో మజ్జిగ, ఆరెంజ్‌ను మరిచిపోకండి..!

Webdunia
మంగళవారం, 17 మార్చి 2015 (19:30 IST)
వేసవిలో మజ్జిగను మరిచిపోకండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మజ్జిగ వేసవికాలంలో తీసుకోవల్సిన బెస్ట్ ఫుడ్స్‌లో ఒకటి. రోజులో తగినంత ఎక్కువ సార్లు మజ్జిగ త్రాగుతుంటే, ఇది శరీరంను చల్లగా ఉంచుతుంది. అంతేగాకుండా.. ఇది శరీరంలో బ్యాక్టీరియాను నాశనం చేసి, సాధారణ జలుబు దగ్గును నివారిస్తుంది. ఇదేవిధంగా వేసవిలో వాటర్ మెలోన్‌ను తప్పకుండా తీసుకోవాలి. ఈ రెడ్ కలర్ జ్యూస్ ఫ్రూట్‌లో 90శాతం నీళ్ళు 10శాతం ఫ్లెష్ ఉంటుంది . వేసవిలో ఈ పండు తినడం వల్ల శరీరాన్ని పూర్తిగా హైడ్రేషన్‌లో ఉంచుతుంది. 
 
వేసవికాలంలో ఆరెంజ్ పండ్లు తినడం చాలా అవసరం. ఎందుకంటే శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి వీటిలో పుష్కలంగా దొరుకుతుంది. ఆరెంజ్‌లో కూడా అధిక మొత్తంలో ప్రోటీన్స్ కలిగి ఉండి, మన శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఆరెంజ్ ఎంతగానో సహాయపడుతుంది.
 
ఇకపోతే.. కొబ్బరి బోండాంలోని నీరు తీసుకోవడం వల్ల వేసవికాలంలో శరీరంను చల్లగా ఉంచుతుంది. కాబట్టి, కోకనట్ వాటర్ వేసవికాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు చర్మాన్ని మృదువుగా తాజాగా ఉంటుంది. అంతేగాకుండా కొబ్బరి నీళ్లు శరీరంలోని టాక్సిన్స్ నివారిస్తుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments