Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు వాడే టూత్ పేస్ట్ ఎలా ఉంది?

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2010 (18:24 IST)
FILE
ముఖానికి నవ్వు అందాన్నిస్తుంది. ఆ నవ్వుకు దంతాలు మరింత అందాన్నిస్తాయి. దంతాల పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలమంటున్నారు దంతవైద్య నిపుణులు. దేశంలోని ప్రజలు దాదాపు 51 శాతం మాత్రమే టూత్ పేస్టు, టూత్ బ్రష్‌ను వాడుతున్నారంటే నమ్మబుద్ధి కావట్లేదుకదూ... అందునా భారతదేశంలో నివసించే ప్రజల్లో దంత సమస్యలపై లేదా దంతాలను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకోలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం దంతాలపై అవగాహన లేకపోవడమేనంటున్నారు వైద్యులు.

దేశంలోని కేవలం 19 శాతం మంది ప్రజలు మాత్రమే ఉదయం, రాత్రి రెండు పూటలా దంతావధానం చేస్తున్నట్లు ఓ సర్వేలో తెలిసింది. అలగా పంటి నొప్పి కలిగినప్పుడు దేశంలోని 82 శాతం మంది ప్రజలు వైద్యుల వద్దకు వెళ్ళి చికిత్స చేసుకునేందుకు వెనుకాడుతున్నారు. అదే నూరుమందిలో కేవలం ముగ్గురు మాత్రమే నిత్యం ప్రతి ఏడాదికి ఒకసారి తమ దంత పరీక్షల కొరకు వైద్యుల వద్దకు వెళుతుంటారని ఆ సర్వే ఫలితాలు వెలువరించింది.

టూత్ పౌడర్ లేదా టూత్ పేస్ట్

దంతావధానం చేసేందుకు టూత్ పౌడర్ లేదా టూత్ పేస్ట్ ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి మాత్రమే ఎంచుకోవాలి. ఎందుకంటే వీటిలో ఏదో ఒకదానితోనే బ్రష్ చేయగలుగుతారు. దీంతో దంతావధానం సరిగా చేయగలుగుతారు. ఒకవేళ మీరు టూత్ పౌడర్‌ను వినియోగించాలనుకుంటే ఆ పౌడర్ నున్నగా ఉండేలా చూసుకోండి.

మీరు వాడే టూత్ పేస్ట్ ఎలా ఉండాలంటే...

* ఏదైనా మంచి కంపెనీ లేదా మంచి బ్రాండ్ కలిగిన టూత్ పేస్ట్‌ను ఉపయోగించండి.

* టూత్ పేస్ట రంగు, రుచి, సువాసనకు బదులుగా దాని పనితనమెంతో తెలుసుకోండి.

* ఆహారం లేదా నీరు తీసుకునే సమయంలో మీ దంతాలకు చల్లగా-వేడిగా అనిపిస్తే మెడికేటెడ్ టూత్ పేస్ట్‌ను ఉపయోగించండి.

* ఎక్కువ వైటనర్స్ కలిగిన టూత్ పేస్ట్‌ను ఎక్కువకాలంపాటు వాడటం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు దంతవైద్య నిపుణులు.

* ఫ్లోరైడ్‌తో కూడుకున్న టూత్ పేస్ట్‌ను వాడదలచుకుంటే వైద్యుల సలహా మేరకు వాడండి.

* చిన్న పిల్లలకు ఫ్లోరైడ్‌తో కూడుకున్న టూత్ పేస్ట్ ఇవ్వకండి.

* ఎట్టి పరిస్థితుల్లోను ఏ రకానికి చెందిన టూత్ పేస్ట్‌ను మింగకండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

Show comments