Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్రలో జూన్ 5 : "ప్రపంచ పర్యావరణ దినోత్సవం"

Webdunia
పిల్లలూ... చరిత్రలో, జూన్ 5వ తేదీని "ప్రపంచ పర్యావరణ దినోత్సవం"గా పాటిస్తున్నారు. ఈ పర్యావరణ దినోత్సవం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే 1972, జూన్ 5వ తేదీన స్థాపించబడింది. పర్యావరణ దినం సందర్భంగా, ప్రతి సంవత్సరం జూన్ 5న ఏదేని ఒక నిర్ణీత నగరంలో పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది.

ఈ అంతర్జాతీయ సమావేశంలో పర్యావరణానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలను చర్చించటమేగాకుండా, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పలు మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తుంటారు. 1972వ సంవత్సరంలోనే స్థాపించబడిన "ఐక్యరాజ్యసమితి పర్యావరణ పథకం", ఇదే వేదికను ఉపయోగించుకుని పర్యావరణానికి సంబంధించి.. రాజకీయాల్లోని వారికి, ప్రజలకు అప్రమత్తతను పెంచే దిశగా తగు చర్యలను చేపడుతుంది.

1972 వ సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2005, జూన్ 5న శాన్ ఫ్రాన్సిస్కోలో అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో గ్రీన్ సిటీస్, "ప్లాన్ ఫర్ ది ప్లానెట్" అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు.

జూన్ 5, 2006లో అల్గేరియా దేశంలో, "డోంట్ డెజర్ట్ డ్రైల్యాండ్స్" అనే నినాదంతోనూ... జూన్ 5, 2007లో నార్వేలో "మెల్టింగ్ ఐస్ ఎ హాట్ టాపిక్" అనే నినాదంతో... జూన్, 2008 న్యూజిలాండ్‌లో "కార్బన్‌డయాక్సైడ్, కిక్ ద హాబిట్ టు వర్డ్స్ ఎ లా కార్బన్ ఎకానమీ" అనే నినాదంతోనూ... పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించారు.

ఇదిలా ఉంటే... నేడు మానవుడు తన మేధో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలను నెలకొల్పుతున్నాడు. ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో కోలుకోలేనంతగా వాతావరణం కలుషితమై... పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం.. అన్నీ కలుషితమవుతున్నాయి. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు.

అంతేగాకుండా, మానవుడు తన వేగవంతమైన జీవితంలో వాహన వేగం పెంచుతూ, ఇంధన కొరతకు కారణమవుతున్నాడు. కార్బన్‌ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ లాంటి విషపూరిత వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతోంది. అడవులు, జల వనరులు క్రమేపీ తగ్గిపోతున్నాయి. ఈ రకంగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణమవుతోంది.

కాబట్టి పిల్లలూ... ప్రకృతి వనరులను నాశనం చేసుకుంటే, ముందు ముందు జీవకోటికి మనుగడ లేకుండా పోతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి నడుచుకోవాలి. దీనికి పర్యావరణ పరిరక్షణ ఒక్కటే నివారణ మార్గమని ఐక్యరాజ్యసమితి కూడా నినదిస్తోంది. అందులో భాగమే, ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పాటించటం. ఇకపోతే... ప్రపంచవ్యాప్తంగా ఓ సమస్యగా పరిణమించిన వాతావరణ కాలుష్యాన్ని నివారించే క్రమంలో మానవులంతా బాధ్యతాయుతమైన పాత్రను పోషించాల్సిన సమయం ఆసన్నమైంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Show comments