Webdunia - Bharat's app for daily news and videos

Install App

"గ్రేట్ వాల్ ఆఫ్ చైనా" పొడవెంతో తెలుసా..?!

Webdunia
పిల్లలూ... ఇప్పటిదాకా ప్రపంచ వింతల్లో ఒకటైన "గ్రేట్ వాల్ ఆఫ్ చైనా" పొడవు 5 వేల కిలోమీటర్లుగా ఉంటుందని అంచనా వేశారు. అయితే చైనా ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో తాజాగా నిర్వహించిన సర్వే, మ్యాపింగ్‌ల ప్రకారం.. గ్రేట్ వాల్ పొడవు 8,851 కిలోమీటర్లుగా తేలింది.

చైనా డైలీ పత్రిక కథనం ప్రకారం... గతంలో చారిత్రక రుజువుల ఆధారంగా ఈ గోడ పొడవును 5 వేల కిలోమీటర్లుగా అంచనా వేశారనీ, అయితే గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ (జీపీఎస్), ఇన్‌ఫ్రా-రెడ్ రేంజ్ ఫైండర్ల సహాయంతో చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ (ఎస్ఏసీహెచ్), స్టేట్ బ్యూరో ఆఫ్ సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ (ఎస్‌బీఎస్ఎం) సంస్థలు రెండేళ్లపాటు నిర్వహించిన సర్వే... చైనా గోడ పొడవును 8,851 కిలోమీటర్లుగా నిర్ధారించింది.

పది రాష్ట్రాల పరిధిలో నిర్మాణమైన ఈ రక్షణ గోడలో 6,259.6 కిలోమీటర్ల మేరకు రాతి కట్టడం, 359.7 కిలోమీటర్ల మేర కందకం, 2,232.5 కిలోమీటర్ల మేర కొండలు, నదులు లాంటివి ప్రకృతి సహజ రక్షణ కవచాలుగా ఉన్నట్లు పై సర్వే సంస్థలు వెల్లడించినట్లు చైనా డైలీ పత్రిక పేర్కొంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నా : బాలకృష్ణ

పహల్గాం ఉగ్రదాడి.. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరి అరెస్టు

జగన్‍‌కు పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్... మంత్రి గొట్టిపాటి

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అమెరికా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ట్రంప్ ఆరంభించారు.. మేం అంతం చేస్తాం..!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

Show comments