రాత్రిపూట భయానక కలలొస్తే.. నీల రత్న ధారణ మంచిది!

Webdunia
సోమవారం, 9 జూన్ 2014 (13:10 IST)
చాలా మందికి రాత్రిపూట భయానక కలలొస్తున్నాయా..? అయితే నవరత్నాలలో నీల రత్నాన్ని ధరించండని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అకస్మాత్తుగా జరిగే దొంగతనాలు, దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే నీలరత్నాన్ని ధరంచడం మంచిదని వారు చెబుతున్నారు. 
 
ఇకపోతే.. ముఖకాంతికి, నేత్రకాంతికి నీలమును ధరించడం మంచిదని రత్నాల శాస్త్రం చెబుతోంది. శనిగ్రహదోషాలను, ఏలినాటి శని దోషాలను నివారించేందుకు నీలమును ధరించడం శ్రేయస్కరమని ఆ శాస్త్రం పేర్కొంటోంది. అదేవిధంగా ఆయుష్షు, బుద్ధి, బలము వృద్ధి చెందేందుకు నీలరత్నధారణ ఎంతో ఉపయోగపడుతుందని విశ్వాసం.
 
ముఖ్యంగా కుంభరాశి జాతకులు నీలరత్నాన్ని ధరిస్తే మంచి ఫలితాలుంటాయి. శాంత స్వభావం, ధర్మకర్మల యందు ఆసక్తి కలిగి ఉండే కుంభరాశి జాతకులు నీలరత్నాన్ని ధరించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇంగ్లీష్‌లో సెఫైర్ అని పిలువబడే ఈ రత్నములో ఇంద్రనీలము, మయూర నీలము, నీలమణి అనే రకాలున్నాయి. 
 
నీలము ఎక్కువగా శుభ్రముగా ఉండవు. చారలు కలిగి ఉండే అసలైన నీలమును, నీరు నింపిన గ్లాసులో వేస్తే ఆ నీటి నుంచి నీల కిరణాలు వెలువడుతాయి. అదేవిధంగా అసలైన నీలమును ఎండలో వుంచినట్లైతే నీలపు కిరణాలను వెదజల్లుతాయి.
 
ఎలా ధరించాలంటే.. శనివారం సూర్యోదయానికి ముందే ధరించాలి. వెండిలోహముతో పొదిగించుకుని ఎడమచేతి మధ్యవేలుకు ధరించాలి. ధరించేందుకు ముందు పాలులో గానీ, గంగాజలములో గానీ నీలరత్నాన్ని శుద్ధిచేయాలి. అదేవిధంగా శనిధ్యాన శ్లోకమును 190 సార్లు ధ్యానించి ధరించడం ద్వారా దారిద్ర్యాలు తొలగిపోతాయని నమ్మకం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు

ఇరాన్‌పై అమెరికా దాడులు... అట్టుడుకిపోతున్న గల్ఫ్ దేశాలు

దైవానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా... మరణానికి కొద్ది నిమిషాల ముందు ఖమేనీ ట్వీట్

ఎక్కువ కాలం భూమ్మీద మనుగడ సాగించలేవన్న జ్యోతిష్కుడు.. ప్రాణాలు తీసుకున్న మహిళ

ఇరాన్ కీలక నిర్ణయం - ఐఆర్‌జీసీ కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిది

అన్నీ చూడండి

లేటెస్ట్

27-02- 2026 శుక్రవారం ఫలితాలు : దూర ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు...

26-02-2026 గురువారం ఫలితాలు - కొత్త సమస్యలు తలెత్తకుండా...?

Hanuman Chalisa.. హనుమాన్ చాలీసాను రోజూ పఠిస్తే.. ఏంటి ఫలితం?

Amalaki Ekadashi 2026: అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే..?

Baba Vanga predictions: ఆ నాలుగు రాశులకు అదృష్టం తలుపు తడుతుందట..

Show comments