Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు ఆశ్లేష నక్షత్రం, 1వ పాదములో పుట్టిన వారైతే...?

Webdunia
FILE
ఆశ్లేష నక్షత్రము తొలి పాదములో పుట్టిన జాతకులు 17 సంవత్సరముల వరకు బుధ మహర్ధశ ప్రభావం ఉండటంతో పచ్చను బంగారముతో పొదిగించుకుని ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అలాగే 17-24 సంవత్సరముల వరకు ఈ జాతకులకు కేతు మహర్ధశ కావున వైఢూర్యమను వెండితో పొదిగించుకుని చిటికెన వ్రేలికి ధరించడం ద్వారా ఉన్నత విద్యను అభ్యసించడం, మంచి ఉద్యోగంలో స్థిరపడటం వంటి ఫలితాలుంటాయి.

కాగా.. 44-50వరకు ఈ ఆశ్లేష 1వ పాదములో పుట్టిన జాతకులకు రవి మహర్ధశ కావున కెంపును వెండితో ఉంగరపు వేలుకు ధరించాలి. అలాగే 50-60 సంవత్సరముల వరకు ఆశ్లేష 1వ పాదములో జన్మంచిన వారికి చంద్ర మహర్ధశ కావున ముత్యమును వెండితో ఉంగరపు వ్రేలుకు ధరించడం ద్వారా సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

ఇకపోతే.. ఈ జాతకులకు 60-67 సంవత్సరముల వరకు కుజ మహర్ధశ ప్రభావం ఉండటంతో పగడమును బంగారముతో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించడం మంచిది.

అలాగే 67-85 సంవత్సరాల వరకు ఆశ్లేష జన్మకారులకు రాహు మహర్ధశ కావున గోమేధికమును వెండితో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

ఇదిలా ఉంటే జీవితంలో శ్రమించి ఉన్నత పదవులను అలంకరించే ఆశ్లేష 1వ పాదములో పుట్టిన జాతకులు, ఇతరుల సలహాలను గౌరవిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది. అయితే కొత్త వ్యాపారాలను ఆరంభించడంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఇకపోతే.. ఈ జాతకులకు తెలుపు, నీలం, క్రీమ్ రంగులు కలిసివస్తాయి. ఈ రంగులతో కూడిన దుస్తులు, నగలు ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. ఇంకా 7, 2 అనే సంఖ్యలు వీరికి అనుకూలిస్తాయి. 2, 11, 20, 29, 38, 47 , 16, 25, 34, 43, 52, 61, 70 వంటి సంఖ్యలు కూడా ఈ జాతకులకు కలిసివస్తాయి. కానీ 4 అనే సంఖ్య వీరికి అశుభం.

కాగా, ఆశ్లేష ఒకటో పాదంలో పుట్టిన జాతకులకు బుధ, ఆదివారాలు మంచి ఫలితాల నివ్వగా, గురువారం మాత్రం వీరికి కలిసిరాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

అన్నీ చూడండి

లేటెస్ట్

20-05-2025 మంగళవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

TTD: శ్రీవారికి రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా ఇచ్చిన మైసూర్ రాజమాత

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

Show comments