Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులారాశి, విశాఖ మూడో పాదములో పుట్టినవారైతే..?

Webdunia
FILE
తులారాశి, విశాఖ నక్షత్రములో మూడో పాదములో పుట్టిన జాతక ు లు 8 సంవత్సరముల వరకు కనక పుష్యరాగమును బంగారముతో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్రం చెబుతోంది. 8 సంవత్సరముల నుంచి 27వ సంవత్సరాల వరకు ఈ జాతకులకు శని మహర్దశ కావడంతో నీలమును వెండితో మధ్య వేలుకు ధరించగలరు.

27-44 సంవత్సరాల వరకు ఈ జాతకులకు బుధ మహర్దశ కావడంతో పచ్చను బంగారముతో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించడం శ్రేయస్కరం. 44 సంవత్సరాల నుంచి 51వ సంవత్సరము వరకు కేతు మహర్దశ కావడంతో వైడూర్యమును వెండితో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

ఇకపోతే.. 51వ సంవత్సరముల నుంచి 71 సంవత్సరాల వరకు ఈ జాతకులపై శుక్ర మహర్దశ ప్రభావముండుటచే వజ్రమును బంగారముతో ఉంగరము వేలుకు ధరించడం మంచిది. 77 సంవత్సరాల నుంచి 87 సంవత్సరాల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం.
FILE


ఇదిలా ఉంటే తులారాశి, విశాఖ నక్షత్రం, మూడో పాదంలో పుట్టిన జాతకులకు నీలపు రంగు అన్ని విధాలా కలిసివస్తుంది. కాబట్టి నీలపు రంగు చేతిరుమాలును వాడటం మంచిది. అదృష్ట సంఖ్యల విషయానికొస్తే.. వీరికి 6 అనే సంఖ్య అన్ని విధాలా అనుకూలిస్తుంది. 4, 5, 8 అనే సంఖ్యలు శుభ ఫలితాలిస్తాయి.

కానీ 1, 2 అనే సంఖ్యలు వీరికి కలిసిరావు. ఇంకా ఈ జాతకులపై శుక్రుని ప్రభావముండుట చేత గురువారం వీరికి శుభఫలితాలనిస్తుందని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

6 నిమిషాల్లో 18 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను పట్టేసిన మహిళ (video)

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

అన్నీ చూడండి

లేటెస్ట్

05-07-2025 శనివారం దినఫలితాలు - ప్రముఖుల సందర్శనం వీలుపడదు...

04-07-2025 శుక్రవారం దినఫలితాలు : జూదాలు, బెట్టింగులకు జోలికి పోవద్దు

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

Show comments