2019 సంవత్సరం ముగిసిపోనుంది. 2020కి స్వాగతం పలుకాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే, 2019 సంవత్సరంలో అనేక మంది క్రికెటర్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించారు. అలాగే, ఐసీసీ ప్రపంచ కప్ పోటీలు ఈ యేడాదిలోనే జరిగాయి. ఈ పోటీలకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ ఆతిథ్యమిచ్చింది. ఈ సంవత్సరంలో పరుగుల వరద పారింది. ముఖ్యంగా, ఆరుగురు ఆటగాళ్లు వెయ్యికిపైగా పరుగులు సాధించారు. మరో నలుగురు బ్యాట్స్‌మెన్లు 900కి పైగా పరుగులు చేశారు.
ఇలా పరుగుల వరద పారించిన ఆటగాళ్ళలో భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో నిలిచాడు. మొత్తం 27 ఇన్నింగ్స్‌లలో 1490 పరుగుల చేశాడు. ఈ యేడాది 1400కి పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ కావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. అయితే, 2019లో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆటగాళ్ళ వివరాలను పరిశీలిస్తే,