Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి ఖజానాలో రూ.25 కోట్ల పాత పెద్దనోట్లు..! ఆర్బీఐకి తితిదే లేఖ..?

పాత పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. 50 రోజుల పాటు పాతపెద్ద నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు ప్రధాని మోడీ. అయితే ఆ సమయం కాస్త అయిపోయింది. కానీ తిరుమల వెంకన్న హుండీలో మాత్రం ఇప్

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (15:19 IST)
పాత పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. 50 రోజుల పాటు పాతపెద్ద నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు ప్రధాని మోడీ. అయితే ఆ సమయం కాస్త అయిపోయింది. కానీ తిరుమల వెంకన్న హుండీలో మాత్రం ఇప్పటికీ పాతపెద్దనోట్లు వస్తూనే ఉన్నాయి. కారణం.. హుండీలో పాత నోట్లు వేయకూడదన్న నిబంధనలను తితిదే పెట్టకపోవడమే. గత నెల 31వతేదీతో పాత పెద్దనోట్లు రద్దయ్యాయి. అయితే ఏదైనా ప్రధాన కారణాన్ని చూపించి తిరిగి జమ చేసుకునే అవకాశం ఉన్నా ఎవరూ కూడా పాతనోట్లను జమచేయడం లేదు. 
 
గతనెల 31వ తేదీ నుంచి ఇప్పటి వరకు పాతపెద్ద నోట్లు పడుతూనే ఉన్నాయి. కొత్తనోట్లు, చిల్లర నోట్ల కన్నా, పాత పెద్ద నోట్లే అధికంగా ఉండడంతో తితిదే ఉన్నతాధికారులకు దిక్కుతోచని పరిస్థితి. ప్రతిరోజు 2 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది తితిదేకి. ఇక సెలవుదినాల్లో అయితే మరింత పెరుగుతుంది. అంటే 4 కోట్ల రూపాయలు. కానీ ప్రస్తుతం హుండీ ఆదాయం కోటి రూపాయలు మాత్రమే ఉంది. కారణం పాత పెద్ద నోట్ల రద్దే. అన్నీ పాతపెద్ద నోట్లే కావడంతో హుండీలో నుంచి డబ్బులను తీసి పక్కనబెట్టేస్తున్నారు. బ్యాంకులలో జమచేసుకోవడం లేదు. 
 
జమచేసుకోవడం విషయం పక్కనబెడితే ఆ పాతపెద్దనోట్లన్నీ తిరుపతిలోని తితిదే ఖజానాలో మూలుగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై ఆర్‌బిఐకి తితిదే ఒక లేఖ కూడా రాసింది. కాని ఇప్పటివరకు వారి నుంచి ఎలాంటి సమాధానం లేదు. దీంతో చేసేది లేదు వచ్చిన డబ్బులను వచ్చినట్లుగానే లెక్కించి ఖజానాలో భద్రపరుస్తున్నారు. ఇప్పటి వరకు 25కోట్ల రూపాయల పాతనోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. 
 
దీనిపై నాలుగుపేజీల లేఖను తితిదే ఉన్నతాధికారులు ఆర్ బిఐకి రాశారు. గతనెల 30వతేదీ ఈ లేఖ ఆర్ బిఐ కి చేరింది. కానీ ఇప్పటి వరకు ఆర్ బిఐ నుంచి ఎలాంటి సమాధానం లేదు. దీంతో ఆ నగదును అలాగే ఉంచేశారు తితిదే అధికారులు. ఇది ఇలాగే కొనసాగితే పాత పెద్దనోట్లతో ఖజానా నిండిపోవడం ఖాయం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments