Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజిటల్ లావాదేవీలు చేస్తే కూడా నడ్డి విరుస్తానంటున్న ఎస్‌బీఐ.. బ్యాంకు జోలికి పోయారో.. ఇకపై బాదుడే మరి

కొన్ని వందల కోట్ల రూపాయలను అప్పనంగా బడాబాబులకు రుణాలిచ్చి వాటిని వసూలు చేసే శక్తిలేక దద్దమ్మల్లాగా మిగిలిపోయిన మన ఘనపాటి ఎస్‌బీఐ తన ఆదాయం పెంచుకోవడానికి మామూలు ఖాతాదారులపై కొరడా ఝళిపించడానికి సిద్ధమైంది. దేశంలో అత్యధికులు వినియోగించే ప్రభుత్వ బ్యాంకి

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (03:34 IST)
కొన్ని వందల కోట్ల రూపాయలను అప్పనంగా బడాబాబులకు రుణాలిచ్చి వాటిని వసూలు చేసే శక్తిలేక దద్దమ్మల్లాగా మిగిలిపోయిన మన ఘనపాటి ఎస్‌బీఐ తన ఆదాయం పెంచుకోవడానికి మామూలు ఖాతాదారులపై కొరడా ఝళిపించడానికి సిద్ధమైంది. దేశంలో అత్యధికులు వినియోగించే ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా... ప్రతి లావాదేవీకీ పరిమితిని విధిస్తూ... డిజిటల్‌ లావాదేవీలు జరిపేవారిని కూడా నడ్డి విరిచే కార్యక్రమానికి తెరతీసింది. ముఖ్యంగా ఆరు రకాల లావాదేవీలపై ఎస్‌బీఐ విధించిన పరిమితులు, చార్జీలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ పరిమితులను దాటి వినియోగిస్తే లావాదేవీలపై చార్జీలు, సేవా పన్ను రూపంలో ఖాతాదారుడి జేబు గుల్లవటం ఖాయం.
 
నోట్ల రద్దు ప్రకటన తర్వాత నగదు లావాదేవీలకు చెల్లు చీటీ పలకాలని, డిజిటల్ లావాదేవీలే జరపాలని ప్రధాని నరేంద్రమోదీతో సహా ప్రతి మంత్రీ, అధికారి చెప్పడంతో విధిలేక డిజిజల్ బాచ పట్టిన జనంకు ఇప్పుడు ఎస్బీఐ దిమ్మదిరిగేలా చార్జీల మోత విధించడానికి సిద్ధమైంది. 
 
ఏటీఎం లావాదేవీలు, బేసిక్ సేవింగ్ ఖాతాలు, బడ్డీ వాలెట్‌లు, ఆన్‌లైన్ నగదు బదిలీలు, ఏటీఎం కార్డుల జారీ, చెక్ బుక్‌ల జారీ, ఇలా బ్యాంకును ఏ సేవ పొందినా చార్జీల మోత మోగించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమైపోయింది. బ్యాంకుల్లో డబ్బు పెట్టాలంటేనే భయపడే స్థితికి ప్రజలను నెడుతున్న ఎస్బీఐ నిర్వాకాన్ని ఇక్కడ చూద్దాం.
 
ఉచిత ఏటీఎం లావాదేవీలను ఇప్పుడు కనీస నిల్వలతో అనుసంధానం చేశారు. ఖాతాలో ప్రతి నెలా నిల్వ ఉన్న సగటు ఆధారంగా ఈ చార్జీలను విధిస్తారు. కనీస నిల్వ రూ.25,000 దాటి ఉంటే లావాదేవీలపై ఎటువంటి పరిమితులూ ఉండవు. సాధారణ సేవింగ్‌ అకౌంట్స్‌పై మెట్రో నగరాల్లో అయితే ప్రతి నెలా 8 లావాదేవీలు (ఎస్‌బీఐ ఏటీఎంలలో 5 + ఇతర బ్యాంకుల ఏటీఎంలలో 3) ఉచితం. అదే నాన్‌ మెట్రో పట్టణాలు అయితే 10 లావాదేవీల (5 ఎస్‌బీఐ ఏటీఎం, 5 ఇతర బ్యాంకుల ఏటీఎంలు) వరకు ఉచితం.
 
గ్రామీణ ప్రాంతాల్లో పొదుపును ప్రోత్సహించడానికే విత్‌డ్రాయల్స్‌పై పరిమితులు విధించినట్లు ఎస్బీఐ చెబుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు లావాదేవీలు పెంచడానికి ప్రారంభించిన బేసిక్‌ సేవింగ్స్‌ ఖాతాలైతే చార్జీల ప్రభావం కాస్త ఎక్కువే పడుతుంది. బేసిక్‌ ఖాతా ఉన్న వారు నెలలో నాలుగు సార్లు (ఏటీఎంతో కలిపి) ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఈ పరిమితి దాటితే నేరుగా బ్యాంకు శాఖ నుంచి తీసుకుంటే రూ. 50 చార్జీ వేస్తారు. అదే ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి అయితే రూ. 20, ఎస్‌బీఐ ఏటీఎం నుంచి అయితే రూ. 10 చెల్లించాలి. ఈ రుసుములకు సేవా పన్ను అదనం.
 
తక్షణం నగదు బదిలీకై వినియోగించే ఐఎంపీఎస్‌ సేవలపై కూడా ఎస్‌బీఐ పరిమితులను విధించింది. ఐఎంపీఎస్‌ విధానంలో పంపించే లక్ష రూపాయల లోపు మొత్తంపై రూ.5 చార్జీ, సేవా పన్ను చెల్లించాల్సి వస్తుంది. రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్ష లోపు లావాదేవీలపై రూ.15, ఆపైన రూ.5 లక్షలలోపు రూ.25 చార్జీ చెల్లించాలి.
 
కొత్తగా జారీ చేసే ఏటీఎం కార్డులపై కూడా చార్జీలను వసూలు చేస్తోంది. కానీ ఖాతాదారులు రూపే క్లాసిక్‌ కార్డు తీసుకుంటే ఎటువంటి చార్జీలు ఉండవు. అలా..కాకుండా వీసా, మాస్టర్‌ వంటి ఇతర కార్డులు తీసుకుంటే మాత్రం అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
 
ఇక నుంచి కొత్త చెక్‌బుక్‌ తీసుకోవాలన్నా డబ్బులు కట్టాల్సిందే. 10 కాగితాలు ఉండే చెక్‌బుక్‌ అయితే రూ.30, అదే 25 కాగితాలుంటే రూ.75, ఇంకా పెద్దది 50 చెక్కులు ఉండే పుస్తకమయితే రూ.150 చెల్లించాలి. ఈ రుసుములకు సేవాపన్ను అదనం.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments