Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాప్రభో... ఈ గండం నుంచి గట్టెక్కించండి.. మన్మోహనుడి శరణు కోరిన ఉర్జిత్ పటేల్!

భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో గతంలో పని చేసిన ఆర్బీఐ గవర్నర్లందరికంటే.. చెడు పేరును సంపాదించుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో కోట్లాది మంది ప్రజలు అష్టకష్టాలు పడు

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (12:34 IST)
భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో గతంలో పని చేసిన ఆర్బీఐ గవర్నర్లందరికంటే.. చెడు పేరును సంపాదించుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో కోట్లాది మంది ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే.. దాదాపు పక్షం రోజుల పాటు మీడియా కంటికి కనిపించకుండా పోయారు. దీంతో ఆయనపై రాజకీయ నేతలతో పాటు.. ఆర్థికవేత్తలు సైతం అనేక విమర్శలు చేశారు. ఇపుడు ఆయన ముందు ఓ పెద్ద చిక్కు ఉంది. అదేంటంటే.. డీమోనిటైజేషన్ అంశంపై తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలంటూ పార్లమెంటరీ కమిటీ ఆయనకు నోటీసు పంపింది. దీంతో ఆయన విధిగా కమిటీ ఎదుట హజరై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఆయన మాజీ ప్రధానమంత్రి, ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఆశ్రయించారు. ఈ గండం నుంచి గట్టెక్కే ఉపాయం చెప్పాలంటూ ఆయన శరణు కోరారు. దీంతో ఉర్జిత్‌ను మన్మోహన్ సింగ్ ఓ సలహా ఇచ్చారు.
 
డీమానిటైజేషన్‌కు సంబంధించి ఉర్జిత్‌ పటేల్‌ను ప్రశ్నించేందుకు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. ఈ విషయంలో మన్మోహన్‌ జోక్యం చేసుకొని చతురతతో వ్యవహరించే వ్యూహాన్ని వివరించారు. 'మౌనంగా ఉండండి..' పార్లమెంటరీ కమిటీ అడిగే ప్రశ్నలతో ఇబ్బందులు వస్తాయనుకుంటే మౌనం పాటించండి. ఒక్క మాట కూడా నోరు తెరవొద్దు అంటూ సలహా ఇచ్చారు. 
 
అంతేనా, ఆర్‌బీఐకి ఇబ్బంది కలిగే ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వొద్దని సూచించారు. డీమానిటైజేషన్‌ సందర్భంగా కేంద్రం ఆర్‌బీఐని పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో మన్మోహన్ ఈ సలహా ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ పరిస్థితి మరింత జఠిలం కాకుండా మన్మోహన్‌ తన చతురతతో సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments