Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జాతి కోడి మాసం కేజీ ధర రూ.900... హాట్‌కుల్లా అమ్ముడు పోతోందట...

సాధారణంగా బ్రాయిలర్ కోడి మాంసం ధర పెరుగుతూ.. తగ్గుతూ ఉంటుంది. అంటే ఈ రకం కోడి ధర నిలకడగా ఉండదు. కానీ కడక్‌నాథ్ అనే జాతి కోడి మాంసం ధర మాత్రం పెరగడమే గానీ నేలచూపే చూడదట. పైగా.. ఈ చికెన్ హాట్‌కేకుల్లా అ

Webdunia
ఆదివారం, 8 జనవరి 2017 (10:54 IST)
సాధారణంగా బ్రాయిలర్ కోడి మాంసం ధర పెరుగుతూ.. తగ్గుతూ ఉంటుంది. అంటే ఈ రకం కోడి ధర నిలకడగా ఉండదు. కానీ కడక్‌నాథ్ అనే జాతి కోడి మాంసం ధర మాత్రం పెరగడమే గానీ నేలచూపే చూడదట. పైగా.. ఈ చికెన్ హాట్‌కేకుల్లా అమ్ముడు పోతోందట. ఇంతకీ ఈ జాతి కోడి ఎక్కడ లభిస్తుందనే కదా మీసందేహం.. మన దేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఈ కోడి మాసం ధర హైదరాబాద్‌లో కిలో రూ.900. 
 
బ్రాయిలర్‌ చికెన్‌తో పోలిస్తే కడక్‌నాథ్‌ చికెన్‌లో పోషకాలూ ఎక్కువ. కొవ్వు అతి తక్కువగా ఉండి మాంసకృత్తులూ ఎక్కువగా ఉండటంతో మార్కెట్‌లో కడక్‌నాథ్‌ మాంసానికి డిమాండ్‌ ఏర్పడింది. ఈ చికెన్‌ తినడం ద్వారా జీర్ణశక్తితోపాటు వ్యాధి నిరోధక శక్తీ పెరుగుతుందన్న భావన ఉంది. వీటి జీవిత కాలం ఎనిమిదేళ్లు. మామూలు కోళ్లు 45 రోజుల్లో 2.5 కిలోల బరువు పెరుగుతాయి. కడక్‌నాథ్‌ కోడి మాత్రం ఆరు నుంచి ఏడు నెలల్లో ఒకటిన్నర కిలోల బరువు మాత్రమే పెరుగుతుంది. 
 
బిగ్‌బాస్కెట్‌ వంటి ఆన్‌లైన్‌ సైట్స్‌లోనూ చాలా కాలంగా ఈ కోళ్ల అమ్మకం జరుగుతోంది. కోడి, మాంసం, ఎముకలు నల్లగా ఉండటమే ఈ కోడి ప్రత్యేకత. బ్రాయిలర్‌ కోళ్ల లాగా ఈ కోళ్ల పెంపకం కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరం లేదు. రాగులు, జొన్నలు, సజ్జలు వంటి వాటిని దాణాగా పెట్టొచ్చు. ఫారాల్లో పెంచే కోళ్లతో పోలిస్తే వీటికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువే. 
 
కాబట్టి ఎలాంటి మందుల అవసరం ఉండదు. అంతరించే దశకు చేరిన కడక్‌నాథ్‌ కోళ్ల పెంపకాన్ని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహిస్తోంది. ఈ కోళ్ల మాంసంలోని ప్రత్యేక ఔషధ గుణాల గురించి దేశ వ్యాప్తంగా ప్రచారం మొదలుకావడంతో ఇపుడు తమిళనాడుతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో వీటి విక్రయాలు, పెంపకం ప్రారంభమైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments