Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్‌లోనూ ఆస్తులు కొనేశారు, చెన్నై టాప్, హైదరాబాద్ లాస్ట్: ప్రాప్‌ టైగర్‌ నివేదిక

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (16:33 IST)
ప్రధానమైన మార్కెట్‌లలో మొత్తం గృహ విక్రయాలలో రెడీ టు మూవ్‌ ఇన్‌ (ఆర్‌టీఎంఐ) గృహాల వాటా మహమ్మారి కారణంగా ప్రభావితమైన 2020లో 21% వృద్ధి చెందింది. అంతకుముందు సంవత్సరం ఇది కేవలం 18%గా మాత్రమే ఉంది. గృహ కొనుగోలుదారులు నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్లతో ఉన్న ప్రమాదాలను పరిగణలోకి తీసుకుని, నిర్మాణం పూర్తయిన అపార్ట్‌మెంట్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు అని ప్రాప్‌టైగర్‌ డాట్‌ కామ్‌ అధ్యయనం వెల్లడించింది.
 
తమ తాజా నివేదిక ‘రియల్‌ ఇన్‌సైట్స్‌ రెసిడెన్షియల్‌ యాన్యువల్‌ రౌండప్‌ 202’లో ప్రాప్‌ టైగర్‌ వెల్లడించిన దాని ప్రకారం మొత్తంమ్మీద 1,82,640 యూనిట్లును 2020 క్యాలెండర్‌ సంవత్సరంలో విక్రయించారు. వీటిలో 21% ఆర్‌టీఎంఐ విభాగంలో ఉండగా, 79% నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి.
 
2019లో, మొత్తంమ్మీద 3,47,590 యూనిట్లను విక్రయిస్తే, వాటిలో 18% ఆర్‌టీఎంఐ యూనిట్లు. ప్రాప్‌ టైగర్‌ పరిశోధన కనుగొన్న దాని ప్రకారం ఆర్‌టీఎంఐ వాటా 2016వ సంవత్సరం నుంచి కూడా వృద్ధి చెందుతుంది. 2015లో విక్రయించబడిన మొత్తం గృహాలలో ఆర్‌టీఎంఐ గృహాల వాటా 7%గా ఉంది. అది 2016వ సంవత్సరంలో 10%కు వృద్ధి చెందితే, 2017లో అది 12%కు మరియు 2018లో 15% మరియు 2019లో 18% వృద్ధి చెందింది.
 
‘‘రిస్క్‌ తీసుకోవడానికి భయపడుతున్న గృహ కొనుగోలుదారులలో అధికశాతం మంది రెడీ టు మూవ్‌ ఇన్‌ ఫ్లాట్స్‌ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆఖరికి నిర్మాణంలో ఉన్న గృహాలలో సైతం బ్రాండెడ్‌ డెవలపర్లు కావడంతో పాటుగా ఎలాంటి వివాదం లేని ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన వారి పట్ల ఆసక్తి చూపుతున్నారు’’ అని ధృవ్‌ అగర్వాల్, గ్రూప్‌ సీఈవో, హౌసింగ్‌ డాట్‌ కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్‌ మరియు ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ అన్నారు.
 
పలు నగరాల వ్యాప్తంగా చూసినప్పుడు ఆర్‌టీఎంఐ యూనిట్ల వాటా మొత్తం అమ్మకాలలో అత్యధికంగా చెన్నైలో ఉంది. అక్కడ 32%గా ఇది ఉంటే, అత్యల్పంగా హైదరాబాద్‌లో 12%గా 2020వ సంవత్సరంలో ఉంది. అయితే, ఆర్‌టీఎంఐ  యూనిట్ల వాటా మొత్తం అమ్మకాలలో అత్యధికంగా వృద్ధి చెందింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఇది 2020వ సంవత్సరంలో 27% వృద్ధి చెందింది. అంతకుముందు సంవత్సరం అది 17%గా మాత్రమే ఉంది.
 
సెంటిమెంట్లు వృద్ధి చెందాయి
మొత్తంమ్మీద ఆర్ధిక వాతావరణం వృద్ధి చెందడంతో, గృహాలకు డిమాండ్‌ సైతం గణనీయంగా వృద్ధి చెందింది మరియు  సరఫరా కూడా కోవిడ్‌ ముందస్తు స్థాయికి చేరుకుంటుంది. నూతన ప్రారంభాలు నాల్గవ త్రైమాసంలో గణనీయంగా వృద్ధి చెందాయి. ఏప్రిల్‌- సెప్టెంబర్‌ త్రైమాసంలో ఇది వృద్ధి నమోదు చేయలేదు.
 
తాజా డిసెంబర్‌ 2020 ప్రాప్‌ టైగర్‌ రీసెర్చ్‌ సర్వే వెల్లడించిన దాని ప్రకారం, రియల్‌ ఎస్టేట్‌ ఇప్పటికీ అత్యంత ప్రాధాన్యతా ఆస్తి శ్రేణిగా నిలిచింది. దాదాపు 43% మంది స్పందనదారులు రియల్‌ ఎస్టేట్‌ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఫిక్సడ్‌ డిపాజిట్లు మరియు స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులుకు 21% మరియు 20% స్పందనదారులు మాత్రమే ఆసక్తి చూపుతున్నారు.
 
గతంలో అధ్యయనాన్ని మే 2020లో చేశారు. దేశమంతా లాక్‌డౌన్‌ ఉన్న వేళ కోవిడ్-19 వ్యాప్తిని ప్రభుత్వం పరిశీలిస్తుంటే, 35% మంది స్పందనదారులు రియల్‌ ఎస్టేట్‌ను ప్రాధాన్యతా ఆస్తి తరగతిగా తీసుకున్నారు. ఫిక్సడ్‌ డిపాజిట్లను 22%, స్టాక్స్‌ను 15% మరియు బంగారాన్ని 28% అభిమానించారు. ఈ నేపథ్యంలో, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వాతావరణం అనేది సుదీర్ఘమైన ప్రక్రియగా మారబోతుంది. డిసెంబర్‌ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం 47% మంది పార్టిస్పెంట్లు భారీ గృహాలను కోరుకుంటున్నారు. మే 2020 సర్వేలో కేవలం 33% మంది మాత్రమే దీనికి ప్రాధాన్యతనిచ్చారు.
 
‘‘కరోనా వైరస్‌ మహమ్మారి తరువాత భారీ గృహాలకు డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. రియల్‌ ఎస్టేట్‌ అనేది ఎల్లప్పుడూ ప్రాధాన్యతా పెట్టుబడి శ్రేణిగా అది అందించే భద్రతతో పాటుగా మూలధన వృద్ధి కారణంగా కనిపిస్తుంది. అయితే, కోవిడ్-19 మహమ్మారి కారణంగా గృహ యాజమాన్య పరంగా ఆసక్తిలో మార్పులు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా, మిల్లీనియల్స్‌ నడుమ ఇది కనిపిస్తుంది’’ అని శ్రీ అగర్వాల్ అన్నారు.
 
ఈ అధ్యయనాన్ని ప్రాప్‌ టైగర్‌ రీసెర్చ్‌ చేపట్టింది. ఈ అధ్యయనాన్ని ఏప్రిల్‌- మే 2020 మరియు సెప్టెంబర్‌- డిసెంబర్‌ 2020 నడుమ దేశవ్యాప్తంగా ప్రధానమైన ఎనిమిది నగరాలలో చెప్పుకోతగ్గ ప్రాతినిధ్యపు సంఖ్యతో చేసింది. దాదాపు మూడు వేల మందికి పైగా సంభావ్య గృహ కొనుగోలుదారుల అభిప్రాయాలను ఈ కాలంలో తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం