Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్షిక బడ్జెట్ 2023-24 హైలెట్స్ ఇవే...

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (14:19 IST)
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఆమె ప్రసంగం గంటన్నరపాటు సాగింది. ఇందులో వివిధ రంగాలకు పలు కేటాయింపులు చేసారు. పలు స్కీముల ప్రకటను చేశారు. ఆమె చేసిన ప్రసంగంలోకి కీలకాంశాలను పరిశీలిస్తే, 
 
* మహిళల కోసం కొత్తగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ 
* రెండేళ్ళ కాలవ్యవధిలో ఈ స్కీమ్. ఇది ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం. ఈ డిపాజిట్‌పై 7.5 శాతం వడ్డీ ఇస్తారు. గరిష్టంగా రూ.2 లక్షల మేరకు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు వుంది. 
 
* సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో డిపాజిట్ పరిమితి పెంపు. ప్రస్తుతం 15 లక్షలుగా ఉన్న ఈ పరిమితిని ఇకపై రూ.30 లక్షలకు పెంచారు. 
 
* కర్నాటకలో వెనుకబాటుతనం ఎదుర్కొంటున్న ప్రాంతాల సాగు రంగానికి రూ.5300 కోట్లు కేటాయింపు
* పీఎం కౌశల్ పథకం కింద రూ.4 లక్షల మందికి నైపుణ్యాభివృద్ది శిక్షణ
* దేశీయ ఉత్పత్తుల విక్రయం కోసం యూనిటీ మాల్స్ ఏర్పాటు
* దేశంలో 50 నూతన విమానాశ్రయాలు, హెలిప్యాడ్‌ల ఏర్పాటు
* దేశంలో కొత్తగా 50 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి నిధుల కేటాయింపు. 
 
* జాతీయ సహకారం డేటా బేస్ కింద రూ.2516 కోట్లు కేటాయింపు
* కృత్రిమ మేథ అభివృద్ధికి  ప్రత్యేకంగా నిధుల కేటాయింపు
* కృత్రిమంగా లేబోరేటరీల్లో వజ్రాల తయారీకి ఐఐటీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు 
* లఢక్‌లో రెన్యూవల్ ఎనర్జీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.20,700 కోట్లు కేటాయింపు. 
 
* వ్యవసాయ స్టార్టప్‌ల్ ప్రోత్సాహానికి ప్రత్యేక నిధులు
* గ్రీన్ ఎనర్జీ గంరలో మరిన్ని ఉపాధి అవకాశాలు
* రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందిస్తాం. 
* శ్రీ అన్న పథకం ద్వారా చిరు ధాన్యాల రైతులకు ప్రోత్సాహం
* ఆత్మనిర్భర క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్
* మత్స్య రంగానికి రూ.6 వేల కోట్లు
 
* దేశ వ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీ ఏర్పాటు
* గిరిజనుల కోసం పీఎం పీవీటీజీ మిషన్ ఏర్పాటు, 
* నేషనల్ టిజిట్ల లైబ్రరీ ప్రోత్సాహం 
* ఫార్మారంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం
* సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక తోడ్పాటు 
* మూలాధన వ్యయాలు మొత్తం రూ.10 లక్షల కోట్లు
 
* కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం రూ.75 వేల కోట్లు
* పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు
* చిన్నారులు, యువత కోసం జాతీయ స్థాయిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు 
* రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు
* 2022-23 పోల్చితే రైల్వేకు 9 రెట్లు నిధుల పెంపు 
* రాష్ట్రాలకు వడ్డీ లేని రుణం మరో యేడాది పొడగింపు
 
* ఈ పథకం కింద రుణాల మంజూరుకు రూ.13.7 లక్షల కోట్లు
* ప్రవేటు పెట్టుబడులు ఆకర్షణ కోసం ప్రత్యేక విభాగం 
* డిజిటల్ ఇండియాకు అనుగుణంగా వన్‌స్టాప్ ఐడెంటిటీ కేవైసీ విధానం  
* ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి కోసం మిషన్ కర్మయోగి
*  రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కోసం రూ.75 వేల కోట్లు
* ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ.7 వేల కోట్లు
 
* నేషనల్ హైడ్రోజన్ మిషన్‌కు రూ.19700 కోట్లు
* ప్రత్యామ్నాయ ఎరువుల అభివృద్ధికి గోవర్ధన్ స్కీమ్ 
* 63 వేల సొసైటీల కంప్యూటరీకరణకు రూ.2516 కోట్లు
* 5జీ ప్రోత్సాహానికి యాప్‌ల అభివృద్ధి కోసం వంద ల్యాబ్‌లు 
* పోటీ పద్దతిలో 50 పర్యాటక ప్రాంతాలు గుర్తింపు 
* నీతి ఆయోగ్ మరో మూడేళ్లు పొడగింపు
 
*  ఐటీ అభివృద్ధి కోసం 30 అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు 
* కోస్తాలో మడ అడవుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు 
* 2025 వరకు అమల్లో మహిళా సమ్మాన్ బచత్ పత్ర పథకం 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments