‘ముక్క’ ప్రియులకు ఇక్కట్లే... భారీగా పెరిగిపోయిన ధరలు

Webdunia
సోమవారం, 7 జులై 2014 (17:04 IST)
మేక, కోడి మాంసం, చేపలు, రొయ్యల ధరలు పెరిగిపోవడంతో ముక్కలేనిదే ముద్ద దిగని మాంసాహార ప్రియుల జిహ్వకు గడ్డుకాలం దాపురించింది. మేక మాంసం ధర కేజీ రూ. 400 వరకు పెరిగిపోవడంతో సామాన్యులు వంద గ్రాముల లెక్కన కొనుగోలు చేస్తున్నారు. కోడి బ్రాయిలర్ లైవ్ కేజీ రూ.100 ఉండగా, మాంసం కేజీ రూ.200 వరకు చేరింది. గ్రామీణులు ఎక్కువగా తినే లేయర్ కోడి లైవ్‌ ధర కేజీ రూ.74 ఉండగా, మాంసం ధర రూ.150 కు పెరిగింది.  
 
కోడిగుడ్డు చిల్లర ధర రూ.4.50. చేపలు, రొయ్యల ధరలూ భారీగానే ఉన్నాయి. గత నెలలో ఉభయ గోదావరి జిల్లాల్లో చెరువుల్లో పెద్ద ఎత్తున చేపలు చనిపోతే కేజీ రూ.ఐదుకు తెగనమ్మారు. ఇప్పుడది రూ.90కి చేరింది. బహిరంగ మార్కెట్‌లో మాత్రం శీలావతి, బొచ్చ చేప, గడ్డిమోసుల కేజీ ధర రూ.140 నుంచి రూ.150 వరకు ఉంది. చందువా, కొర్రమీను కేజీ రూ.300 వరకు పలుకుతున్నాయి. వెనామీ రొయ్యలే కాదు.. సేక (తెల్ల) రొయ్యల ధర సైతం కేజీ రూ.200 నుంచి రూ.220 వరకు ఉంది.
 
బియ్యం ధర వింటే భయం..
బియ్యం ధరలు బహిరంగ మార్కెట్‌లో భారీగా పెరిగాయి. సన్నరకాల ధరలు గత రెండు నెలల్లో కేజీకి బ్రాండ్‌ను బట్టి కేజీకి రూ.ఐదు నుంచి రూ.ఏడు వరకు పెరిగాయి. నెల రోజుల క్రితం రూ.45 వరకు ఉన్న గిద్దమసూరి(రారైస్) కేజీ రూ.50 నుంచి రూ.52 వరకు పెరిగింది. గిద్దమసూరు స్టీమ్ రకాలను చాలా కంపెనీలు భారీగా పెంచివేశాయి. రూ.33 ఉన్న స్టీమ్ రకం ధరలు రూ.41 నుంచి రూ.46 వరకు పెరిగాయి. గిద్దమసూరిలోని పండారు రకాలు రూ.34 వరకు ఉంది. సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే స్వర్ణ బియ్యం ధర సైతం పెరిగింది. ధాన్యానికి డిమాండ్ ఏర్పడిందనే వంకతో కేజీ రూ.24 ఉన్న ధరను రూ.26 వరకు పెంచారు. బస్తాకు రూ.50 వరకు పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ గ్లింప్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు సాన

అడివి శేష్ డెకాయిట్‌ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

Samaira: కామాఖ్య నుంచి ఫ్రెండ్షిప్ మెలోడీ సఖీ సాంగ్ రిలీజ్

Adi Sai Kumar: ఆది సాయి కుమార్ కొత్త చిత్రం టైటిల్ సైరాబాను

Bellamkonda Sai : తిరుమలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి వివాహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

Show comments