Webdunia - Bharat's app for daily news and videos

Install App

shani jayanti 2022: శని అమావాస్య ప్రాముఖ్యత ఏంటి? శని ప్రసన్నం కోసం ఏం చేయాలి?

Webdunia
సోమవారం, 30 మే 2022 (10:09 IST)
శని జయంతి ప్రాముఖ్యత
ఈ రోజు మే 30న శని జయంతి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలలో శనికి ప్రత్యేక స్థానం ఉంది. శని జయంతి లేదా శని దేవుడి జన్మదినాన్ని జ్యేష్ఠ అమావాస్య అని కూడా పిలుస్తుంటారు. ఒక వ్యక్తిని శిక్షించడం లేదా ఆశీర్వదించడం కోసం శని అనుగ్రహం తప్పనిసరి అని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. పురాణాల ప్రకారం ఛాయాదేవి-సూర్యదేవుడు కుమారుడైన శనిదేవుడు జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున జన్మించాడు. అందుకే జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకునే సంప్రదాయం ఉంది.

 
శని అమావాస్య: ప్రాముఖ్యత
శని దేవుడిని న్యాయ దేవుడు అంటారు. కర్మకు అధిపతి, వారు చేసే పనుల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తాడు. మానవ జీవితంపై శనిదేవుడి ప్రభావం చాలా అధికంగా వుంటుందని విశ్వాసం. భక్తులు తమ జాతకచక్రంలోని శని దుష్ప్రభావాల నుండి విముక్తి పొందడానికి శనిదేవుని ఆశీర్వాదం కోసం ఒక రోజంతా ఉపవాసం పాటిస్తారు. ఫలితంగా భక్తులు శని దేవుడిని ప్రసన్నం చేసుకుంటారు.
 
ఇక ఈ ఏడాది 2022 సంవత్సరం జ్యేష్ఠ మాసంతో అమావాస్య తిథి కలయిక మే 30. ఈ రోజున మరెన్నో శుభ యోగాలున్నాయి. మే 30న సోమవారం కావడంతో సోమవతి అమావాస్య. దీనితో పాటు సర్వార్థసిద్ధి యోగం, సుకర్మ యోగం వంటి ఎన్నో అరుదైన శుభ కలయికలు రానున్నాయి. వటసావిత్రి వ్రతం కూడా ఇదే రోజు. మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు.
 
శని ప్రభావం... ఏలినాటి శని ఎన్నాళ్లు?
ఏలినాటి శని ప్రభావం ఏడున్నర ఏళ్లు వుంటుంది. ఏలినాటిని ఏడునాడు కూడా అని కూడా అంటారు. నాడు అంటే అర్థభాగం అని అర్థం. జాతకచక్రంలో 12 రాశులుంటాయి. గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో గ్రహ ప్రభావం ప్రారంభమవుతుంది. 12, 1, 2 స్థానాల్లో శని గ్రహం ప్రవేశిస్తుంది. ఒక్కోస్థానంలో శని రెండున్నర సంవత్సరాలు వుంటాడు. దీంతో మొత్తంగా ఏడున్నర సంవత్సరాలు శని వుంటాడని అర్థం. శని పాపగ్రహం అందుకనే కష్టాలు కలుగుతాయి. 
ఈ గ్రహం మన రాశిలో వున్నప్పుడు ప్రాణభయం, ధనం లేకపోవడం ఒకవేళ వచ్చినా వెళ్లిపోవడం, మంచిస్థానం నుంచి అధమస్థానానికి వెళ్లిపోవడం... తదితరాలు జరుగుతాయి. శని మన రాశిలో ప్రవేశించినా కొన్ని మంచిపనులు చేసేందుకు దోహదం చేస్తాడు. ఉదా. వివాహం, ఇంటి నిర్మాణం, ఉద్యోగం లాంటివి. అయితే వీటి వెనుక చాలా ఇబ్బందులు వుంటాయి. వివాహం జరిగితే చాలా ఖర్చు ఏర్పడుతుంది. 
 
అలాగే ఇంటి నిర్మాణం పూర్తి చేయడమో లేక ఇంటిని కొనుగోలు చేస్తే అనంతరం ఆర్థిక వనరులకు కటకట ఏర్పడుతుంది. ఒక ఉద్యోగి ఇంటిని కొనుగోలు చేస్తే అతడి నెల జీతం నుంచి నెలవారీగా వాయిదాలు కట్టవలసివుంటుంది. దీంతో జీతం తగ్గుతుంది. అందుకనే ఇల్లుకట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు. శని ప్రభావ తీవ్రత తగ్గించేందుకు పెద్దవాళ్లు అనేక మార్గాలు సూచించారు. విష్ణు సహస్రనామం, సుందరాకాండ పారాయణం, ఆదిత్య హృదయం, భగవంతుని ప్రార్థన చేయాల్సివుంటుంది. దీంతో పాటు తీర్థయాత్రలు, వ్రతాలు చేయాలి. 
 
ప్రతి శనివారం శనిదేవుడిని ఆరాధించడం, నవగ్రహాల్లో ఆయన విగ్రహం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చేయాలి. పరమేశ్వరుని పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. పక్షులకు ఆహారం వేయాలి ముఖ్యంగా కాకులకు ఆహారం పెడితే మంచిది. ఆవులకు ఆహారం వేయడంతో పాటు నల్ల చీమలకు చక్కెర వేయడం లాంటి కార్యాలతో శని ప్రభావాన్ని తగ్గించవచ్చు. యాచకులకు, వికలాంగులకు అన్నదానం చేస్తే శని తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు. అన్నింటికన్నా మనస్సును స్థిరంగా, పవిత్రంగా వుంచుకొని ఆ పరమేశ్వరుని ఆరాధనలో వుంటే ఏ గ్రహ ప్రభావం మనపై పడదు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments