Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం నాగ పంచమి - గరుడ పంచమి... పూజ ఎలా చేయాలి?

శ్రావణ మాసంలో వచ్చే 5వ రోజున “ నాగ పంచమి“గా కొంతమంది “గరుడ పంచమి”గా పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో “నాగ పూజ“కి ఒక గొప్ప విశిష్టత మరియు సంప్రదాయముగా ఆచరణలో ఉంది. నాగ పంచమి ప్రాముఖ్యతని సాక్షాత్ పరమ శివుడే స్కంద పురాణములో వివరించాడు. శ్రావణ శుద్ధ పంచమి

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (19:48 IST)
శ్రావణ మాసంలో వచ్చే 5వ రోజున “ నాగ పంచమి“గా కొంతమంది “గరుడ పంచమి”గా పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో “నాగ పూజ“కి ఒక గొప్ప విశిష్టత మరియు సంప్రదాయముగా ఆచరణలో ఉంది. నాగ పంచమి ప్రాముఖ్యతని సాక్షాత్ పరమ శివుడే స్కంద పురాణములో వివరించాడు. శ్రావణ శుద్ధ పంచమి నాడు చేసే నాగ పంచమి అత్యంత విశిష్టతను సంతరించుకుంది. అందుకు కారణము ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు ఆదిశేషుడు “తాము ఉద్బవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని“ వరం కోరుకున్నాడు. ఆదిశేషుని కోరికని మన్నించి మహా విష్ణువు ఈ నాగుల పంచమి రోజు సర్ప పూజలు అందరూ చేస్తారని వరాన్ని ఇస్తాడు.
 
నాగ పంచమి రోజు నాగులని పూజించి, గోధుమతో చేసిన పాయశాన్ని నైవేద్యముగా పెడతారు. నాగ పంచమి రోజు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనము చేస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతలను పూజించినవారికి " విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః, న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్ "ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పొయ్యాలి. నాగ పంచమి రోజున పూజ చేసిన వారికి విష భాధలు ఉండవు. సర్ప స్తోత్రాన్ని ప్రతిరోజు మరియు నాగ పంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు లేక రోగాలు రావు. వంశము అభివృద్ధి అవుతుంది. సంతానోత్పత్తి కలుగుతుంది. కార్యసిద్ధి జరుగుతుంది. అన్ని కార్యములు సవ్యంగా నెరవేరతాయి. కాలసర్ప దోషాలు, నాగ దోషాలు ఉన్నా తొలగిపోతాయి.
 
చక్కని సంతానాన్ని ఇచ్చే గరుడ పంచమి
కశ్యప ప్రజాపతికి వినత.. కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువలన సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి 'నాగ పంచమి'గా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక, శ్రావణ శుద్ధ పంచమిని 'గరుడ పంచమి' అని కూడా పిలుస్తుంటారు. శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కనుక సర్ప భయం లేకుండా వుండటం కోసం ఈ రోజున అంతా నాగపూజ చేస్తుంటారు. అలాగే 'గరుడ పంచమిగా చెప్పుకునే ఈ రోజున, గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. 
 
అయితే సోదరులు వున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది. సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి, ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి వుంటుంది. సాధారణంగా ఏ తల్లి అయినా తన కొడుకు తాను గర్వించేలా, లోకం మెచ్చేలా వుండాలని అనుకుంటుంది. అలా తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం దేవేంద్రుడితోనే పోరాడాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అభినందనలను అందుకుని ఆయన వాహనంగా ఉండిపోయాడు. అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన, ఆరోగ్యవంతులైన, ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments