Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోలీ పండుగ రోజున పితృదేవతలను పూజిస్తే..?

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (15:51 IST)
బృందావనంలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకునే హోలీ పండుగ రోజున ప్రజలు రంగుల పొడిని మరియు రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం రంగపంచమి రోజున భగవంతుడైన కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమకు కొనియాడుతారు. 
 
భగవంతుడైన కృష్ణుడు గోపిలకతో తన కుచేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశారని విశ్వాసం. హోలీకి ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్ (హోలికను కాల్చడం) లేదా చోటీ హోలీ (చిన్న హోలీ) అని అంటారు. 
 
హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు. ఆంధ్రప్రదేశ్‌లో హోలిక దహన్‌ను కామ దహనం అని అంటారు. 
 
హోలిక అను రాక్షసి అనే రాక్షసి రోజుకు ఒక చంటిబిడ్డను తింటూ, ఒక గ్రామవాసులందరికి గర్భశోకాన్ని కలిగించేదట. ఇలా ఒకరోజు ఒక ముదుసరి మనువడి వంతు వచ్చిందట. అది గమనించిన ఆ వృద్ధురాలు హోలిక రాక్షసి నుంచి మనుమడిని తప్పించుకునేందుకు, ఆ గ్రామస్తుల గర్భశోక బాధను నివారించుటకై ఆ మహిమాన్వితుడైన మహర్షిని వేడుకొంటుంది. 
 
అందుకు ఆ రుషి తల్లీ.. ఆ రాక్షసి ఒక శాపగ్రస్తురాలు, ఎవరైనా ఆ రాక్షసిని నోటికిరాని దుర్భాషలతో తిడితే దానికి వెంటనే ఆయుక్షీణమై మరణిస్తుందని చెబుతాడు. అందుకోసం గ్రామస్తులను పోగుచేసి ఆ విధంగా దుర్భాషలాడమని తరుణోపాయం చెప్పినాడు. దానితో ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంతో గ్రామంలోనికి వెళ్లి రుషి తరుణోపాయం గ్రామస్తులకు తరుణోపాయం చెబుతుంది. ఆ మరుసటి రోడు ఆ గ్రామస్తులందరిచేత ఆ ముదుసలి ఆ రాక్షసిని అనరాని మాటలనిపిస్తుంది. 
 
ఆ దుర్భాషలను తట్టుకోలేక కొండంత హోలీ రాక్షసి కుప్పకూలి మరణిస్తుంది. దానితో పిల్లలు పెద్దలు ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ కట్టెలు ప్రోగు చేసి ఆ చితిమంటలో హోలీరాక్షసిని కాల్చివేచి వసంతాలు చల్లుకుంటూ పండుగ చేసుకుంటారు. నాటి నుంచే హోలం పండుగ వచ్చిందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంకా హోలి పండుగ రోజు పితృదేవతలను పూజల ద్వారా సంతృప్తిపరిచి, హోలికా భూమికి నమస్కరిస్తే సర్వదుఃఖాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. హోలీ పండుగ నాడు పితృ దేవతలకు తర్పణాలు సమర్పిస్తే వంశాభివృద్ధి చేకూరుతుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments