Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమజ్జయంతి రోజున ఎలా పూజ చేయాలి.!?

Webdunia
FILE
చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమజ్జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపమెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. హనుమజ్జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమత్కకళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజ చేసే భక్తులు, పూజా మందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి.

పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు. పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా "ఓం ఆంజనేయాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి.

పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యానశ్లోకములు, హనుమాన్‌చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ - ఒక పోస్టుకు 35 మంది పోటీ

'మిస్ వరల్డ్ 2025' విజేత విజయ రహస్యమేంటో తెలుసా?

రెడ్ బుక్‌ను లైట్‌గా తీసుకున్నాం.. 2 నెలల్లో మేమంతా జైలుకే : సజ్జల రామకృష్ణారెడ్డి

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

అన్నీ చూడండి

లేటెస్ట్

Chanakya Niti: భర్తపై భార్య ప్రేమ ఆ సమయాల్లో తేలిపోతుంది.. చాణక్యుడు

30-05-2025 శుక్రవారం దినఫలితాలు - ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు...

Chaturthi: చతుర్థి వ్రతం మే 30, శుక్రవారం వస్తోంది.. గణపతిని పూజిస్తే?

29-05-2025 గురువారం దినఫలితాలు - ఓర్పు, పట్టుదలతో శ్రమించండి...

శరవణభవ నామ జపం చేస్తే చాలు, అంతరార్థం తెలుసా?

Show comments