Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినోద సంబరాల రంగుల పండుగ "హోలీ" శుభాకాంక్షలు

Webdunia
WD
రంగుల పండుగ హోలీ అంటే అందరికి ఎంతో ఉత్సాహం. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా వివిధ రంగులను స్నేహితులపై, బంధువులపై చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడు వస్తుంది. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమను మహా పాల్గుణి అని, హోలికా, హోలికాదాహో (హోళీ) అనే పేర్లతో పిలుస్తుంటారు. అలాగే హుతాశనీ పూర్ణిమా, వహ్ని ఉత్సవం అని కూడా అంటారు.

హోళీ రోజున దేశంలోని పలు ప్రాంతాల్లో లక్ష్మీ నారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, చంద్రపూజ వంటివి జరుపుతుంటారు. మన రాష్ట్రంలో కాముని పున్నమిగా ప్రసిద్ధి చెందిన ఈ హోలీ పండుగ రోజు (ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ) చంద్రుడు ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో ఉంటాడని ప్రతీతి. అందుచేత ఈ రోజున చంద్ర పూజ, సత్యనారాయణ స్వామి పూజ చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

హోలీ పండుగనాడు రంగులను వరసైన వారి మీద చల్లుతూ ఉత్సాహంతో, సంతోషంతో గడుపుతూంటారు. ఈ వేడుక రాబోయే ఆనందకర వసంత రుతువుకు స్వాగత సన్నాహమేనని, ఈ సన్నాహమే సంప్రదాయంగా పరిణమించిందని పురోహితులు చెబుతున్నారు.

ఇంకా హోలీ పండుగ రోజు రాత్రి కొన్ని ప్రాంతాల్లో నాలుగు వీధులు కలిసే చోట పెద్ద పెద్ద భాండాలలో రంగు నీళ్లను నింపి ఉంచుతారు. ఆ నీళ్ళను ఒకరిమీద ఒకరు చల్లుకుంటూ సంతోషంగా కాలం గడుపుతారు. మొత్తానికి హోలీ పండుగ వ్రతం చేసుకునే పెద్ద వాళ్ళకు భక్తిని పంచుతూ, చిన్నారులకు, యువతకు ఆనందాన్ని చేకూర్చుతూ వినోదాల సంబరాలను పంచిపెడుతోంది. కాబట్టి ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిద్దాం..!
అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు పట్టాలపై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌‍ప్రెస్

స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాలి.. పౌరులకు ఆదేశం

FASTag: ఆగస్టు 15 నుండి రూ.3,000 ధరతో కూడిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

అన్నీ చూడండి

లేటెస్ట్

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

Show comments