Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మహాలయ అమావాస్య" నాడు శ్రాద్ధ కర్మలు చేయండి

Webdunia
FILE
ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమ కాలమని పురోహితులు చెబుతున్నారు. అయితే దక్షిణాయణము పితృదేవతల కాలము గనుక అశుభకాలమని మన పూర్వీకుల విశ్వాసం.

ప్రతి మాసంలో వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆరోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంటూ ఉంటారు.

ఇందులో మహాలయము అంటే.. భాద్రపద బహుళ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఉన్న 15 రోజులు. దీన్ని పితృపక్షంగా మహాలయంగా చెప్తారు. ఇందులో మరీ ముఖ్యమైన తిధి త్రయోదశి.

" యత్యించిన్మధునా మిశ్రం ప్రదద్యాత్తు త్రయోదశీమ్ |
తదప్య క్షయమేవస్యాత్ వర్షాసుచ మఘాసుచ" ||
అనగా వర్షఋతువు నందు భాద్రపద కృష్ణత్రయోదశి మాఘా నక్షత్రంలో కూడి ఉన్న సమయంలో ఏ పదార్థమైనా శ్రాద్ధం చేసిన అది పితృదేవతలకు అక్షయ తృప్తిని ఇస్తుందని విశ్వాసం.

అంతటి విశిష్టత గాంచిన ఈ మహాలయ పక్షమందు అందరూ వారి వారిశక్తిని తగినట్లుగా పితృదేవతలకు తర్పణమివ్వాలని పురోహితులు చెబుతున్నారు. కొందరు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయాతిథులలో తర్పణ శ్రాద్ధ కర్మలు ఆచరించవచ్చును. ఒకవేళ గతించిన పెద్దల తిథి గుర్తులేనప్పుడు "మహాలయ అమావాస్య"నాడే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేయడం ఉత్తమమని పురోహితులు అంటున్నారు.

కావున పితృకార్యములు చేయుటకు అర్హత పొందినవారు అంతా విధిగా పక్షాలను ఆచరించి, వారి వారి వంశవృక్షములకారకులైన పితృదేవతలను స్మరించుకుని శ్రాద్ధ కర్మలు చేస్తే వారి శుభాశీస్సులతో సర్వశుభములు పొందుతారని పండితులు పేర్కొంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్‌లో యాక్టివ్ స్లీపర్ సెల్స్ : 48 గంటలు పర్యాటక ప్రాంతాలు మూసివేత

ఈ రోజు అర్థరాత్రి లోపు పాక్ పౌరులు దేశం విడిచి పోవాల్సిందే.. లేకుంటే మూడేళ్లు జైలు!!

Chicken: చికెన్‌ను కట్ చేయమన్న టీచర్.. సస్పెండ్ చేసిన యాజమాన్యం

లూప్ లైనులో ఆగివున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడి

Musical Rock: వరంగల్: నియోలిథిక్ యుగం నాటి శిలా కళాఖండాన్ని కనుగొన్నారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

26-04-2015 శనివారం ఫలితాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Show comments