గడియారాలను గిఫ్ట్‌గా ఇస్తున్నారా? జాగ్రత్త!!

Webdunia
గురువారం, 5 జూన్ 2014 (16:46 IST)
ఆగిపోయిన, పనిచెయ్యని గడియారాలను ఇంట్లో వుంచకూడదని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో శుభకరమైన శక్తిని నింపడానికి గడియారాలనే ఫెంగ్‌షుయ్ నిపుణులు సిఫార్సు చేస్తారు. ఎందుకంటే..? గడియారంలో ముళ్ళు లేదా పెండ్యూలయం లయబద్ధంగా కదులుతూ.. చీ శక్తిని ఇంటి నిండా నింపుతుందని చైనా ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. 
 
అలాంటి గడియారాలను మీ ఇంటి హాలుకు ఎడమవైపు లేదా ముందుగోడకి తగిలించడం మంచిదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అయితే గడియారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి ముఖద్వారానికి ఎదురుగా ఉంచకూడదని వారు చెబుతున్నారు.
 
అలాగే పెళ్ళిళ్లకు, ఇతర వేడుకల్లో గడియారాలను బహుమతిగా ఇస్తుండటం పరిపాటి. కాని గడియారాలను బహుమతిగా స్వీకరించడమో లేదా బహుమతిగా ఇవ్వడమే కూడదని ఫెంగ్‌షుయ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడియారాలను బహుమతి తీసుకోవడం, ఇవ్వడం ద్వారా అశుభ ఫలితాలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు. 
 
అందుచేత గడియారాలను మీరు స్వయంగా కొనుక్కొని ఇంట్లో ఉంచుకోండి. ఇతరులు గడియారాలను బహుమతిగా ఇస్తే సున్నితంగా వారించడం మంచిదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమ్మెను విరమించిన టీజీఎస్సార్టీసీ ఉద్యోగులు.. ఊపిరిపీల్చుకున్న ప్రయాణీకులు

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందు.. ఓవర్ డోస్ కారణంతో వ్యక్తి మృతి.. ఎక్కడ?

ఊయల ఆ బాలిక పట్ల ఉరి తాడై ఉసురు తీసింది

మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరుతారా?

నీవంటే ఇష్టం లేదు.. నలుగురు ప్రియురాళ్లు ఉన్నారని చెప్పిన కాబోయే వరుడు.. ప్రాణాలు తీసుకున్న వధువు

అన్నీ చూడండి

లేటెస్ట్

23-04-2026 గురువారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

తెరుచుకున్న కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు -51 క్వింటాళ్ల పూలతో అలంకరణ

22-04-2026 బుధవారం ఫలితాలు - అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు

వైశాఖ మాసంలో ఆరుద్ర నక్షత్రం, స్కంధ షష్ఠి-శ్రీ రామాను జయంతి.. అన్నీ ఒకే రోజు..

21-04-2026 మంగళవారం ఫలితాలు : పెద్దమొత్తం ధనసహాయం తగదు...

Show comments