Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెంగ్‌షుయ్‌‌తో కంటినిండా నిద్ర: కిటికీకి దగ్గరగా మంచాన్ని?

Webdunia
బుధవారం, 6 ఆగస్టు 2014 (19:19 IST)
సాధారణంగా చాలా మంది రాత్రి పూట నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇందుకు అనేక కారణాలు ఉండవచ్చు. మనసులో ఒత్తిడి, అలసట, ఆందోళనలతో నిద్రకు దూరమవుతుంటారు. అయితే ఈ సమస్యను అధిగమించాలంటే ఫెంగ్‌షూయ్ మార్గాలను అనుసరించి చూడండి.
 
ముందుగా మీరు నిద్రించే మంచం గోడకు ఆనుకుని ఉందా అని గమనించండి. గోడ నుంచి ఓ అడుగు దూరంలో మంచాన్ని అమర్చుకోండి. అంతే కాకుండా మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాలను బెడ్‌రూంలో ఉంచుకోండి. తద్వారా మనసు ప్రశాంతతను సంతరించుకుంటుంది. అంతే కాకుండా మీ బెడ్‌ కనిపించేలా ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్, అద్దాలు వంటివి ఉంచకండి.
 
మీ ఇష్ట ప్రకారం ఓ విండ్‌చిమ్‌ను బెడ్‌రూంలో తగిలించండి. లేదంటే నైరుతి మూల వైపు ఓ క్రిస్టల్‌ను ఉంచండి. ఇవి ఉంచడం ద్వారా మీ మనసు ఆహ్లాదంగా ఉంటుంది. గాలి బాగా రావాలని చాలా మంది మంచాలను కిటికీ, తలుపులకు దగ్గరగా వేసుకుంటారు. అయితే దీన్ని ఫెంగ్‌షూయ్ తప్పుగా పరిగణిస్తుంది. కిటికీలకు, తలుపులకు దూరంగా మంచాన్ని వేసుకోవాలి. 
 
అంతే కాకుండా మీకు నచ్చిన మంద్రమైన సంగీతం మీ చెవులను తాకే విధంగా ఏర్పాటు చేసుకోండి. అలా చేయడం ద్వారా మనసు హాయిగా నిద్రపోతుంది. అలాగే జలపాతాల చప్పుడు, అలల శబ్దాలను వింటూ ఉంటే మనసుకు విశ్రాంతి కలిగి నిద్రలోకి జారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బెడ్ లైట్లకు ఎర్ర లైట్లు వాడే బదులు పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల బల్బులను వాడండి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

Pawan Kalyan: దళితులను అవమానిస్తే ఎదురు తిరగండి.. ఓజీ ఓజీ ఏంటి.. పక్కకు పో...(video)

ఎంపీడీవోపై సుదర్శన్ రెడ్డి దాడి.. చొక్కా పట్టుకుని, చెంపదెబ్బలు కొడుతూ.. సీఐకి సెల్యూట్ (వీడియో)

Hyderabad: బస్టాప్‌లో గంజాయి.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరెస్ట్..

అన్నీ చూడండి

లేటెస్ట్

టీటీడీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ భారీ విరాళం రూ.1.11 కోట్లు

25-12-2024 బుధవారం దినఫలితాలు : అనుకున్న లక్ష్యం సాధిస్తారు...

TTD vaikunta ekadashi 2025 : ఆన్‌లైన్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభం

24-12-2024 మంగళవారం దినఫలితాలు : ఆప్తుల సలహా పాటిస్తారు...

23-12-2024 సోమవారం దినఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త

Show comments