Webdunia - Bharat's app for daily news and videos

Install App

చపాతీలకు టేస్టీ సైడ్ డిష్ "మసాలా పాలక్ కర్రీ రోల్స్‌"

Webdunia
మంగళవారం, 15 జులై 2014 (19:14 IST)
పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరుపును దూరం చేస్తాయి. పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జ్వరం, పిత్త, వాయు, శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. పాలకూర రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాంటి పాలకూరతో కర్రీ రోల్స్ ఎలా చేయాలో చూద్దాం. 
 
కావలసిన పదార్థాలు :
పెద్ద పాలకూర ఆకులు.. 20
ఉడికించిన సేమియా.. రెండు కప్పులు
క్యాప్సికమ్.. 4
ఉల్లిపాయలు.. 2
పచ్చిమిర్చి.. 8
కరివేపాకు రెమ్మలు.. కాసిన్ని
కొత్తిమీర.. 2 కట్టలు
మినప్పప్పు.. 4 టీ.
ఆవాలు, జీలకర్ర, పసుపు.. ఒక్కో టీస్పూన్ చొప్పున
నెయ్యి.. రెండు టీ.
ఉప్పు, నూనె.. సరిపడా
 
తయారీ విధానం :
ముందుగా వేడినీటిలో పాలకూర ఆకుల్ని వేసి తీసేయాలి. బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కల్ని వేసి బాగా మగ్గించాలి. దీనికి ఉల్లిపాయ ముక్కలు, పసుపు చేర్చి మరికాసేపు సన్నని మంటపై ఉంచాలి. చివర్లో ఉప్పు, సేమియా, కొత్తమీర కలిపి పాత్రను దించేయాలి. ఈ మిశ్రమాన్ని పాలకూర ఆకుల్లో ఒక్కో టీస్పూన్ చొప్పున ఉంచి గుండ్రంగా చుట్టి ఉంచాలి.
 
ఇప్పుడు బాణలిలో నెయ్యి వేడిచేసి చుట్టి ఉంచిన పాలకూర ఆకుల్ని ఉంచి నిమిషంపాటు రెండువైపులా వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి మసాలా పాలక్ కర్రీ రోల్స్‌ తయారైనట్లే. ఇవి చపాతీలతోనూ, అన్నంతోనూ కలిపి తినేందుకు చాలా రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments