Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కోలముఖం' ముఖానికి ఎలాంటి నగలు ఎంపిక చేసుకోవాలి?

Webdunia
మంగళవారం, 19 జనవరి 2016 (08:50 IST)
అందంగా కనిపించాలంటే శరీరాకృతికి తగిన దుస్తుల్ని ధరించడమే కాదు.. ఆ దుస్తులకు మ్యాచ్ అయ్యేలా నగల ఎంపిక  కూడా పక్కాగా ఉండాలి. అపుడే మరింత అందంగా కనిపిస్తారు. అలాంటి నగల ఎంపికతో ఏ ముఖానికి ఎలాంటి నగలు ఎంపిక చేసుకోవాలో ఓసారి పరిశీలిద్ధాం. 
 
కోలముఖం (ఎక్కువ పొడవుగా లేని ముఖం) ఉన్నవారికి ఎటువంటి నెక్లె‌స్‌లైనా ఏ షేప్‌లోని చెవి రింగులైనా బాగా నప్పుతాయి. అయితే వీరికి పొడవాటి చైన్‌ మోడల్‌ ఇయర్‌ రింగ్స్‌ చాలా బాగుంటాయి.
 
చతురస్రాకారంలో ఉండే ముఖం ఉన్న వారికి మెడ వరకే ఉండే చోకర్‌ స్టైల్‌ నెక్లె‌స్‌లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీరు చిన్నవి, గుండ్రంగా ఉండే చెవి రింగులు అలాగే బటన్‌ రింగులు పెట్టుకుంటే మరింత అందంగా కనిపిస్తారు. 
 
గుండ్రటి ముఖం ఉన్న వారు పొడవాటి నెక్లెస్‌, దాని కింద మరొక గొలుసు వేసుకుంటే బాగుంటుంది. వీరు గుండ్రటి ఇయర్‌ రింగ్స్‌ కానీ, రౌండ్‌ కట్‌ డైమండ్స్‌ లేదా జెమ్‌స్టోన్స్‌కు బదులుగా చతురస్రాకారం వంటి రకరకాల ఆకారాల్లోని పొడవాటి చెవి రింగులు ధరిస్తే మరింత అందంగా కనిపిస్తారు.
 
హృదయాకార ముఖం ఉన్న వారికి మెడ భాగం చాలా సన్నగా ఉంటుంది. అందువల్ల వారు చిన్న నెక్లె‌స్‌లు, చోకర్స్‌ ధరించడం వల్ల ముఖం కాస్త గుండ్రంగా, అందంగా కనిపిస్తుంది. అలాగే త్రికోణాకారం, చతురస్రాకారంలో ఉండే పొడవైన చెవిరింగులు వీరికి భలే సెట్‌ అవుతాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments