Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోళ్లకు నెయిల్ ఆర్ట్ ఎలా వేసుకోవాలో తెలుసా?

రంగురంగుల నెయిల్ పాలిష్‌లతో పాటు ఒక నెయిల్ రిమూవర్ ఉంటే చాలు. ఎలాంటి ఆర్ట్‌నైనా మీ చేతుల్లో వేసుకోవచ్చు. కొమ్మలు, రెమ్మలే కాదు ముద్దుగొలిపే మకరందపు మందారపువ్వులను కూడా గోళ్లపై పూయించుకోవచ్చు. చూపరుల న

Webdunia
శనివారం, 21 జులై 2018 (16:55 IST)
రంగురంగుల నెయిల్ పాలిష్‌లతో పాటు ఒక నెయిల్ రిమూవర్ ఉంటే చాలు. ఎలాంటి ఆర్ట్‌నైనా మీ చేతుల్లో వేసుకోవచ్చు. కొమ్మలు, రెమ్మలే కాదు ముద్దుగొలిపే మకరందపు మందారపువ్వులను కూడా గోళ్లపై పూయించుకోవచ్చు. చూపరుల నుండి ప్రశంసలు పొందేయెుచ్చు. నిమిషాల్లో నెయిల్ ఆర్ట్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం.
 
ముందుగా నెయిల్స్ శుభ్రం చేసుకుని షేప్ చేసుకోవాలి. తరువాత నెయిల్స్ అన్నింటికి వైట్‌ కలర్ అప్లై చేసుకోవాలి. తరువాత సన్నని బ్రష్ తీసుకుని లైట్ పింక్ కలర్ లేదా మెచ్చిన కలర్‌తో మందార పువ్వులు రేకులు వేసుకోవాలి. ఇప్పుడు కాస్త డార్క్ పింక్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని సన్నని బ్రష్‌తో ఇంతకు ముందు వేసిన లైట్ పింక్ మందార పూలరేకులతో హైలెట్ చేసుకోవాలి.
 
తరువాత గ్రీన్ కలర్ తీసుకుని సింబల్ వేసుకోవాలి. ఇప్పుడు వైట్ కలర్ తీసుకుని సన్నని బ్రష్‌తో గ్రీన్ కలర్ సింబల్‌కి గీతలు పెట్టుకోవాలి. బ్లాక్ కలర్ లేదా డార్క్ గ్రీన్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని ఆకుపచ్చ ఆకు మధ్యలో గీతలు పెట్టుకోవాలి.

తరువాత ఎల్లో కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని మందార పువ్వుపైన మూడు చిన్న చిన్న చుక్కలు పెట్టుకుని వాటిపై రెడ్ కలర్ నెయిల్ కలర్ చుక్కలు పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని నెయిల్స్‌కి మందార పువ్వులు, ఆకులను డిజైన్ వేసుకుంటే సూపర్ లుక్ వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

తర్వాతి కథనం
Show comments