Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకప్ వేసుకున్నాం... కానీ, అది చెదరకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (14:26 IST)
షంక్షన్స్‌కి వెళ్లాలని.. మేకప్ వేసుకుంటారు. కానీ, అక్కడికి చేరేలోపు మేకప్ చెదిరిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే.. స్పూన్ క్యారెట్ రసంలో కొద్దిగా పన్నీరు, చందనం పొడి చేర్చి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆపై మేకప్ వేసుకుంటే గంటల తరబడీ మేకప్ చెదిరిపోకుండా ఉంటుంది.
 
రంగు కోల్పోయిన చర్మానికి క్యారెట్ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. రంగును పెంచటమేగాకుండా చర్మ ఆరోగ్యానికి క్యారెట్ రసం మంచిగా తోడ్పడుతుంది. జుట్టు చివర్లు చిట్లినప్పుడు... క్యారెట్ ఆకులకు కొద్దిగా నువ్వుల నూనె కలిపి మెత్తగా నూరి తలకు రాసుకుని పెసరపిండిని తలకు మర్దిస్తూ స్నానం చేసినట్లైతే.. జుట్టు చివర్లు తెగకుండా, జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది.
 
చర్మం నిగనిగలాడుతూ ఉండేందుకు క్యారెట్‌కు తొక్క తీయకుండా తురిమి ఎండబెట్టాలి. 50 గ్రాము క్యారెట్ ఎండు తురుముకు అంతే సమానంగా కీరాదోస విత్తనాలు, పెసరపప్పు, బార్లీలను పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తూ ఉంటే చర్మం మంచి రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది.
 
కాసిన్ని బాదంపప్పులను నీటిలో నానబెట్టాలి. ఒక క్యారెట్‌కు తొక్క తీయకుండా ముక్కలు చేసి, వాటికి బాదంపప్పును కలిపి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి రాసి అరగంట తరువాత స్నానం చేయాలి. ఇలా పదిహేను రోజులకు ఒకసారి చేస్తే ముడతల చర్మం బిగుతుగా మారుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments