ఈమధ్య 'చందమామ కథలు' అంటూ ఓ సినిమాను ఎన్ఆర్ఐలు తీశారు. ఆ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా చూస్తే.. చందమామ కథలు చదివినంత హాయిగా ఉంటుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. కానీ స్టిల్స్, ట్రైలర్స్ చూస్తే అలా లేదని తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా మంచు లక్ష్మీ... మందు కొడుతూ, సిగరెట్ తాగుతూ కన్పిస్తుంది.
సీన్ ఎలాంటిదైనా డిమాండ్ మేరకే నటించానని చెప్పింది కూడా. ఇదిలా ఉంటే ఇందులో ఓ ఏజ్డ్ జంట నటిస్తోంది. సీనియర్ నరేశ్‌తో పాటు ఆమని కలిసి నటించారు. వీరిద్దరి పాత్రలు చిత్రంగా ఉంటాయి. ఆమెకు భర్త లేడు. ఈయనకు భార్యలేదు. అలాంటి ఇద్దరూ ఒక్కటయితే ఎలా ఉంటుందనేది వీరిపై సీన్స్ చేశారు. వారిద్దరిలో ప్రేమ చిగురించి.. ముద్దులు పెట్టుకునే దాకా వెళితే ఆ తర్వాత ఏం జరుగుతుందనేది తెరపై చూడాలని చెబుతున్నాడు ట్రైలర్స్‌లో.
ఈ ఎన్ఆర్ఐలు తెలుగు సినిమాల పేరుతో కొందరు కల్చర్‌ను భ్రష్టుపట్టిస్తున్నారనే విమర్శలూ వస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఈ విషయమై స్పందిస్తూ.. సినిమా చూశాక అందులో తప్పుంటే కడిగేమయని చెబుతున్నాడు. మరి చూసిన తర్వాత కడిగేస్తారో... భలేగా ఉందని అంటారో వెయిట్ అండ్ సీ.