Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి కానుకగా జనవరి 12న వెంకటేష్‌ 'బాడీగార్డ్‌'

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2011 (18:15 IST)
WD
విక్టరీ వెంకటేష్‌ హీరోగా మల్టీడైమెన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ప్రై) లిమిటెడ్‌ సమర్పణలో శ్రీసాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ (ప్రై) లిమిటెడ్‌ పతాకంపై గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'బాడీగార్డ్‌'. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ - ''ఒక్క పాట మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. డిసెంబర్‌లో ఆడియో రిలీజ్‌ చేసి జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం. థమన్‌ ఈ చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చారు. వెంకటేష్‌ బాబు కెరీర్‌లోనే ఓ విభిన్న చిత్రంగా 'బాడీగార్డ్‌' రూపొందుతోంది. మా బేనర్‌లో వెంకటేష్‌బాబు చేస్తున్న ఈ రెండో సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.

వెంకటేష్‌, త్రిష, సలోని, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, ఆలీ, సుబ్బరాజు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రగతి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్‌, సంగీతం: థమన్‌, ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, డాన్స్‌: రాజుసుందరం, బృంద, విష్ణుదేవా, కో-డైరెక్టర్‌: సురేష్‌కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ప్రసాద్‌ మైనేని, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

కర్ణాటకలో పరువు హత్య.. పూజారినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తెను చంపేసిన తండ్రి

Delivery Boy: డెలివరీ పర్సన్‌‌తో సహజీవనం చేసిన మైనర్ బాలిక.. తర్వాత ఏమైందంటే?

Raja Singh: నేను స్వతంత్ర ఎమ్మెల్యే... స్వేచ్ఛగా మాట్లాడగలను.. రాజా సింగ్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు - అక్టోబర్ వరకు రిజర్వ్‌లో తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

Show comments