Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాన పాట అయ్యింది... ఇక నెక్ట్స్ బికినేయేనా...?!

Webdunia
హ్యాపిడేస్ చిత్రంతో ప్రేక్షకులకు ఖుషీ చేసిన తెల్లపిల్ల తమన్నా ఆవారా సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలుకరించేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ వచ్చిన తమన్నాతో మినీ ఇంటర్య్యూ...

టాలీవుడ్ - కోలీవుడ్ దేనికి ప్రాధాన్యం...?
నాకు రెండూ రెండు కళ్లు లాంటివి(నవ్వు)

వానపాటలో తడుస్తూ నటించడం...
అసలు వానపాటలో నటించనివారు హీరోయిన్‌గా ఎదగలేరు

అంటే ఖచ్చితంగా వాన పాట చేయాలనా మీ ఉద్దేశ్యం...?
అవును. ఖచ్చితంగా చేయాల్సిందే. నా చిన్నప్పుడు వేటగాడు చిత్రంలో శ్రీదేవి "ఆకుచాటు పిందె తడిసె.." వాన పాట చూసి ఎంతో ఇన్‌స్పైర్ అయ్యా. నటిగా అవకాశం వచ్చింది కనుక వానలో తడిసే సాంగ్‌ చేశానంతే.

తడుస్తూ నటించడం కష్టంగా అనిపించలేదూ...
కొంచెం కాదండీ బాబూ... పిచ్చ కష్టం. వాన పాట చేసేటపుడు అన్నీ కరెక్టుగా కుదరాలి. కెమేరా లెన్స్ దగ్గర్నుంచి వేసే స్టెప్పుల వరకూ. పైగా వాన పాటలో నటించేటపుడు మా చుట్టూ వందలమంది ఉంటారు. వారిని పట్టించుకోకుండా డ్యాన్స్ చేయాలి. హబ్బో.. చాలా కష్టం.

అన్నట్లు కార్తితో వానపాటలో నటించేటపుడు షూటింగ్‌కు నేను "కట్" చెప్పా. నేను కట్ చెప్పడంతో అందరూ నావైపు అలాగే చూశారు. విషయం ఏంటంటే.. కార్తి చొక్కాలోకి ఓ దురద పురుగు దూరింది. అది కనుక శరీరంపై పాకితే దద్దుర్లు ఖాయం. అందుకే కట్ చెప్పా. కానీ దర్శకులు దాన్ని కూడా షూట్ చేశారట. సినిమా చూడాలి. ఆ సీన్ ఎలా ఉంటుందో...?

వానపాటలో నటించారు.. ఇక నెక్ట్స్ బికినీయేనా...?
ఎట్టి పరిస్థితుల్లో బికినీ వేసుకోను. అసలు బికినీ అంటే నాకు పరమ అసహ్యం.

వేసుకోవలసిన పరిస్థితి వస్తే...
నాకు అసహ్యం అని తెలిశాక.. ఎవరూ ఆ సీన్‌కు సీనే ఇవ్వరూ. సో... అది కూడా "కట్" (నవ్వుతూ)

కార్తితో క్లోజ్‌నెస్ గురించీ...
మీరూ అడిగారా... సినిమా అన్నాక క్లోజ్‌గా ఉండక ఎలా ఉంటారండీ. ఫ్రెండ్లీగా మూవ్ అయినంత మాత్రాన దానికేదో అర్థాలు తీసుకుంటే నేనేం చేయలేను. లెట్ ఇట్ బీ.. అంతే.

మీ రాబోయే చిత్రాలు...
అల్లు అర్జున్‌తో బద్రీనాథ్ చేస్తున్నా. ఇంకా అంగీకరించిన సినిమాలు చాలానే ఉన్నాయి అని ముగించింది తమన్నా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం : 13 మంది మిస్సింగ్

Tirumala: శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు- ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోదా? (video)

హంతకులు కూడా ఇలా కొట్టరు... తమిళనాడు ఖాకీలపై హైకోర్టు సీరియస్

రైలుకు - ఫ్లాట్‌ఫామ్ ‌మధ్య పడిన యువతి.. మెరుపువేగంతో స్పందించిన కానిస్టేబుల్... (వీడియో)

Hyderabad: భర్తతో గొడవ- అపార్ట్‌మెంట్‌లో 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

Show comments