Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల చేయడానికి ఎవరో ఒకరు తీరిగ్గా ఉండాలిగా..!!

Webdunia
హైదరాబాద్‌లో పుట్టి, అమెరికాలో పెరిగి, చెన్నైలో మోడలింగ్ చేసి తిరిగి హైదరాబాద్‌లో హీరోయిన్‌గా మారిన అమ్మాయి ప్రియా ఆనంద్. లీడర్ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. జర్నలిస్టుగా పాత్ర వేసి శభాష్ అనిపించుకుంది. తొలి చిత్రమైనప్పటికీ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. లీడర్ రిలీజ్ కాక ముందే మరో రెండు చిత్రాల్లో నటించే అవకాశాలు రావడం ప్రియకే సాధ్యమైంది. ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం...

లీడర్‌లో అవకాశమెలా వచ్చింది...?
మా నాన్నగారిది హైదరాబాద్. అమ్మగారిది చెన్నై. పెరిగింది.. చదివింది మాత్రం అమెరికాలో. అనంతరం చెన్నై వచ్చి మోడలింగ్ చేశాను. అప్పుడే "వామనన్" అనే తమిళ చిత్రంలో జై సరసన నటించే అవకాశం వచ్చింది. నా ఫోటోలను ఇంటర్నెట్‌లో చూసి లీడర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు శేఖర్ కమ్ములకు చూపించారు. రత్నప్రభ అనే పాత్రకు నేనైతే సరిపోతానని అన్నారట. రత్నప్రభ రేడియో జాకీ. తను చాలా క్యూట్‌గా లవ్లీగా గోలగోల చేస్తూ ఉంటుంది. పెద్ద బ్యానర్లో నటించడంపై మొదట కాస్త భయం అనిపించింది. యూనిట్లోకి అడుగుపెట్టిన తర్వాత అది ఎటు పోయిందో తెలియలేదు.

ఏవీఎం సంస్థతోపాటు రామానాయుడు వంశంలోనివారైన రానాతో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. గ్రేట్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయడం మరింత ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఉండగానే మరో రెండు చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ఇంతకంటే ఏం కావాలి.

తెలుగులో ఎలా డబ్బింగ్ చెప్పగలిగారు..?
లీడర్ ఆడిషన్లో నాకు తెలుగు రాదు. కానీ షూటింగ్ టైమ్‌లో పట్టుబట్టి నా డైలాగ్స్ నేనే చదవడం, అర్థం చేసుకోవడంతో తెలుగు నేర్చుకున్నాను. అది దర్శకుడు చూసి నా పాత్రకు నా చేతే డబ్బింగ్ చెప్పించారు. ఇందుకు కెమేరామెన్ విజయ్ సి కుమార్ ఎంతగానో సహకరించారు.

మీకు స్ఫూర్తినిచ్చే నటి ఎవరు..?
నాకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం. "క్షణక్షణం"లో ఆమె అమాయకత్వంతోపాటు భయంతో కూడిన ఫీలింగ్‌తో నటించడాన్ని చూసి నటి అంటే అలా ఉండాలని అనుకున్నాను.

మీకంటూ ఉన్న గోల్ ఏమిటో తెలుసుకోవచ్చా...?
గోల్స్ అనేవి పెట్టుకోలేదు. చక్కగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే. పాత్రలపరంగా పక్కింటి అమ్మాయిలా ఉండే తరహాలో నటించాలనుకుంటున్నా. నాకు అవే సూట్ అవుతాయి. ఇక గ్లామర్ అనేది పాత్రల మేరకే ఉంటుంది.

లీడర్‌లో రానాను ఏడిపించినట్లుగా... నిజజీవితంలోనూ...?
అలాంటిదేమీ లేదు. నేను గోల చేస్తాను కానీ మరీ అంతకాదు. సినిమాలో కనుక ఇంకొంచెం చేశాను. ఎప్పుడూ గోల చేయాలంటే ఎవరో ఒకరు తీరిగ్గా ఉండాలి కదా...

ప్రేమ గురించి నిర్వచనం..?
ప్రేమ అనేది రకరకాలుగా ఉంటుంది. ప్రత్యేకించి కొందరిని చూసినప్పుడు ప్రేమ పుడుతుంది. ఒక్కొక్కరిలో ఒక్కో విశేషం మనల్ని ఆకట్టుకుంటుంది. ప్రేమ అనేది తీయని అనుభూతి. పుట్టినప్పటి నుంచి అది మనకు అలవడుతుంది. పెరిగిన వాతావరణం కూడా ముఖ్యమే. నేను నాన్న, అమ్మను తప్ప ఇంకా ఎవరినీ ప్రేమించలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్.. నిందితుల్లో డీన్స్ కుమారుడు? 25 మందిపై సస్పెన్షన్!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులా? ఇద్దరి అరెస్టు కూడా...

పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. అంత నేరం ఏం చేశారు?

రైలు టిక్కెట్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లకు ముగింపు.. ఎలా?

Social media: సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలి.. జగన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

Show comments