Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూర్‌లో కిరాయికి ఆటో మాట్లాడుకున్న పూర్ శ్రియ

Webdunia
గురువారం, 23 జూన్ 2011 (13:14 IST)
ఒక్కొక్కసారి ఎంత సెలబ్రిటీ అయినా టైమ్‌ బాగోకపోతే సామాన్యమైన వ్యక్తిలా సర్దుకుపోవాల్సి ఉంటుంది. శ్రియ ఇదే విషయాన్ని మొన్నీమధ్యే తెలిపింది. సినిమాలు, వాటి తాలూకు షూటింగ్‌లు పెద్దగా లేకపోవటంతో, సినిమా స్టార్స్‌ ఆడిన క్రికెట్‌ మ్యాచ్‌లకు హాజరయింది.

నిజానికి ఆ మ్యాచ్‌లలో బిజీ స్టార్స్‌ చాలా చాలా తక్కువగా వచ్చారు. అంతా జూనియర్‌ ఆర్టిస్ట్‌లు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లే ఎక్కువగా సందడి చేశారు. అయితే మన టాలీవుడ్‌ నుండి మాత్రం వెంకీ, శ్రీకాంత్‌, తరుణ్‌, అఖిల్‌లాంటి స్టార్స్‌ అటెండ్‌ అయ్యారు. శ్రియ మన హీరోలను ఉత్సాహపరిచేందుకు మ్యాచ్‌లకు వచ్చింది.

అయితే బెంగుళూరులో జరిగిన మొదటి మ్యాచ్‌కు అటెండ్‌ అవ్వటానికి ఢిల్లీ నుండి బయలుదేరి బెంగుళూరు చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌ నుండి స్టేడియంకు వచ్చేదారిలో, తానెక్కిన కారు రోడ్డు మధ్యలో ట్రబుల్‌ ఇవ్వటంతో, పాపం ఆటోలో కిరాయికి మాట్లాడుకుని రావాల్సి వచ్చింది. తీరా శ్రియ వచ్చేసరికి, వర్షంపడి మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఆ తర్వాత మ్యాచ్‌ కొనసాగినా, మనవాళ్ళు చెన్నై హీరోల చేతిలో పరాజయం పాలయ్యారు.

దీంతో శ్రియకు ఎక్కడలేని నీరసం వచ్చేసింది. దాంతో రెండో రోజు జరిగిన మ్యాచ్‌ను పూర్తిగా ఆస్వాదించలేకపోయింది. చివరికి తను బయలుదేరిన టైమ్‌ బ్యాడ్‌ అని, ఇలా ఇంకెప్పుడూ రిపీట్‌ కాకుండా చూసుకుంటానని అంటోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

TVK Vijay Maanaadu: మధురై మానాడుకి వెళ్తూ మూత్ర విసర్జన చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

India: అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు- చైనాను అధిగమించిన భారతదేశం

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

Show comments