Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడుదలకు ముందు లాభం తర్వాత నష్టం ఎందుకని..?

Webdunia
" ఆరెంజ్" రిలీజ్‌కు ముందే కోటిన్నర ప్రాఫిట్ అని ఎగ్జిక్యూటివ్ నిర్మాత మన్యం రమేష్ నిర్మాత అయిన తన బావ నాగబాబుతో చెప్పాడట. సరేలే ఏదోవిధంగా లాభపడ్డామని అనుకున్నాడట. అయితే విడుదలైన తర్వాత ఆరున్నరకోట్ల డెఫిషియట్ చూపించాడట. రెండోరోజుకు 18కోట్లకు చేరింది. దీంతో షాక్‌కు గురైన నాగబాబు మన్యం రమేష్‌ను చెడామడా తిట్టేశాడట. దీంతో మనస్థాపం చెందిన రమేష్ ఇంటికి వెళ్లకుండా రోజంతా ఎక్కడో ఉండిపోయాడు.

బావ మొహంలో ఆనందం చూడాలనుకున్నాను. ఇంత కోపం చూడలేక నేను వెళ్లిపోయానని తన ఇంటికి ఫోన్ చేశాడట. ఈ విషయం నాగబాబుకు తెలిసి వేట మొదలెట్టారు. ఫోన్ కాల్ ఏ ఏరియా నుంచి వచ్చిందని ఎంక్వైరీ చేయగా, గచ్చిబౌలి నుంచి అని తెలిసింది. అక్కడికి వెళ్లి ఓ రూమ్‌లో ఉన్న రమేష్‌ను నాగబాబు మంచిగా పలుకరించి.. డబ్బు పోతే పోయింది. నువ్వుపోతే ఎక్కడి నుంచి తేను... అని కాస్త కుదుటపడేలా మాట్లాడారట.

ఆ తర్వాత కారులో వచ్చేటప్పుడు నానా బూతులు తిట్టి వెధవా.. ఎందుకు బతకడం అని తిట్ల వర్షం కురిపించారట. దీంతో నాగబాబు సోదరి క్షమించమని వేడుకొనగా నీ మొహం చూసి వదిలేశానని చెప్పాడట. ఇక ఆ తర్వాత ఎకౌంట్స్ పరిశీలిస్తే... ఆరున్నర కోట్లు రమేష్ వెనకేసినట్లు తేలిందట. ఆ డబ్బుతో రెండు చిన్నపాటి చిత్రాలు తీయాలనే ప్లాన్‌లో ఉన్నాడని ఆయనకు సమాచారం అందింది. దీంతో మింగలేక... కక్కలేక.. ఇక నుంచి వాడి మొహం చూడనని నాగబాబు చెప్పాడట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓ సాదాసీదా ఆర్టీఓ కానిస్టేబుల్: ఇంట్లో రూ. 11 కోట్లు నగదు, 52 కేజీల బంగారం, 234 కిలోల వెండి, ఎలా వచ్చాయి?

వివాదాలతో పని ఏల? వినోదం వుండగా: పుష్ప 2 కలెక్షన్ పై రిపోర్ట్

డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను : బీజేపీ నేత శపథం!!

ఆధారాలు లేకుండా ఈవీఎంలను తప్పుబట్టలేం : సుప్రియా సూలే

సంకీర్ణ ప్రభుత్వంపై చిందులేసిన ఆర్కే రోజా.. తదుపరి ప్రభుత్వం మాదే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

Show comments