Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి రోజులు గుర్తుకు వస్తున్నాయ్‌... గాయని సునీత

Webdunia
శనివారం, 19 ఏప్రియల్ 2014 (21:14 IST)
WD
'' తొలిసారి వీడియో ప్రమోషనల్‌ సాంగ్‌లో నటించడం చాలా ఉత్సుకతను కల్గించింది. కీరవాణి సంగీతం, సీతారామశాస్త్రి సాహిత్యం, శేఖర్‌ కమ్ముల బాగా తెరకెక్కిస్తారనే నమ్మకంతో ఈ పాటను చేయడానికి అంగీకరించాను. తొలి ప్రయత్నానికి వస్తున్న స్పందన చూస్తుంటే.. నా కెరియర్‌ ప్రారంభం గుర్తుకువస్తుందని'' గాయని సునీత అన్నారు.

నయనతార, హర్షవర్ధన్‌ రాణే, వైభవ్‌ నటీనటులుగా తెరకెక్కిన చిత్రం 'అనామిక'. వయాకామ్‌ 18, ఐడెంటిటీ మోషన్‌ పిక్చర్స్‌, లాగ్‌లైన్‌ పిక్చర్స్‌ సంస్థలు నిర్మిస్తున్న చిత్రమిది. మే 1న విడుదల కాబోతుంది. సినిమా ప్రమోన్‌లో భాగంగా శేఖర్‌ కమ్ముల రూపొందించిన ప్రమోషనల్‌ సాంగ్‌లో సునీత నటించారు. ఇటీవలే విడుదలైన పాటకు వచ్చిన స్పందనను చూసి సునీత స్పందించారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ... నేను తొలిరోజుల్లో 'ఈ వేళలో'..పాడిన పాటకు ఎంత స్టార్‌ ఇమేజ్‌ తెచ్చిందో ఆ రోజుల్ని గుర్తు చేసింది ఈ సాంగ్‌. గతంలో ఇటువంటి ఆఫర్లు వచ్చినా సున్నితంగా తిరస్కరించాను. ఎందుకంటే సినిమా కోసం నటీనటులు ఎంత కష్టపడతారో డబ్బింగ్‌ చెప్తున్న సమయంలో చూస్తూనే ఉంటాం. అందుకే వీటికి దూరంగా ఉన్నాను' అన్నారు.

శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ... సునీత సాంగ్‌లో నటించడం ఆనందంగా ఉంది. హై టెక్నాలజీలో 2కె క్వాలిటీతో సినిమా క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా ఈ సాంగ్‌ను తెరకెక్కించాం. నేషనల్‌ ఛానల్స్‌లో కూడా దీని గురించి చర్చించుకోవడం జరిగింది. ఈ చిత్రీకరణకు సహకరించిన అనీష్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ నెల 22న పాటల్ని, మే 1న సినిమాను విడుదల చేయబోతున్నాం అన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments