Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్ కొత్త అవతారం, సామాన్యుడి కోసమే 'మీలో ఎవరు కోటీశ్వరుడు'!

Webdunia
శనివారం, 19 ఏప్రియల్ 2014 (12:20 IST)
WD
టాలీవుడ్ కింగ్ నాగార్జున కొత్త అవతారమెత్తారు. వెండితెరపై ఇప్పటివరకూ కనిపించిన నాగ్ ఇపుడు బుల్లితెరపై సందడి చేయనున్నారు. సామాన్యుడి కలను సాకారం చేయాలనే సదుద్దేశ్యంతో మాటీవీ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే గేమ్‌ షోను త్వరలో ప్రసారం చేయనుందని ఆయన వెల్లడించారు. గతంలో అమితాబ్‌ బచ్చన్‌ సారధ్యంలో వచ్చిన 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' గేమ్‌ షో ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ స్పూర్తితో వివిధ భాషల్లో ఎన్నో టీవీ కార్యక్రమాలు రూపుదిద్దుకుని విజయవంతమయ్యాయి.

ఇప్పుడు ఆ కోవలోనే నాగార్జున వ్యాఖ్యాతగా మాటీవీ కోటి రూపాయల బహుమతితో తెలుగులో ప్రప్రథమంగా ఈ గేమ్‌ షోకి రూపకల్పన చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మాటీవీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ... తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌లో నెంబర్‌ వన్‌ స్థానానికి మాటీవీ చేరుకోవడం ఎనలేని ఆనందాన్ని కల్గిస్తోంది. దానిని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశ్యంతోపాటు, సామాన్యుడి కల నెరవేర్చాలన్న సదాశయంతో ఈ షోని రూపొందించాం.

అలాగే ఈ షో ద్వారా అందరినీ విజ్ఞానవంతులను చెయ్యాలన్నదే మా ఆకాంక్ష. దీని ద్వారా నేను కూడా విజ్ఞానాన్ని మరింతగా సముపార్జించేందుకు అవకాశం కలుగుతుంది. ఇలాటి షోల వల్ల మనపై మనకు మరింత నమ్మకం ఏర్పడుతుంది. ఒక సామాజిక బాధ్యతగా ఈ షోని చేసేందుకు నేను అంగీకరించాను. ఒక్కమాటలో చెప్పాలంటే బుల్లితెరపై నేను ఎత్తుతున్న కొత్త అవతారమిది.

గత వారం నుంచి ఈ షోకి సంబంధించిన ప్రాక్టీస్‌ చేస్తున్నాను. వాస్తవానికి నేను అనుకున్నంత సుళువు కాదిది. ఎంతో ఏకాగ్రతతో చేయాల్సిన షో ఇది. నాలుగైదు సినిమాలు చేసిన దానికంటే ఇది మరింత కష్టంగా ఉంది. అయినప్పటికీ ఇలాంటి మంచి ప్రోగ్రాం చేసే అదృష్టం నాకు కలిగినందుకు ఆనందంగా ఉంది' అన్నారు.

ఇదే వేదికపై నాగార్జున, అమల దంపతులు ఓ ట్రైల్‌ షో చేశారు. అందులో భాగంగా అమల కొన్ని ప్రశ్నలను నాగార్జునకు సంధించారు. అయితే అవి సరదాగా వ్యక్తిగత ప్రశ్నలు కావడంతో నవ్వులు పువ్వులు విరిశాయి. ఇదే వేదికపై పాల్గొన్న మాటీవీ ఛైర్మన్‌ నిమ్మగడ్డ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఆరేళ్ళ క్రితం మేము మాటీవీలో భాగస్వాములయ్యాం.

దీనికి ఇంత పేరు రావడానికి చిరంజీవి, నాగార్జున కుటుంబాలు ఎంతగానో కృషి చేశాయి. మా అందరి ఆలోచనలకు అనుగుణంగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ను సక్సెస్‌ఫుల్‌ చేయదలచుకున్నాం' అని చెప్పారు. ఇంకా మాటీవీ డైరెక్టర్‌ అల్లు అరవింద్‌, ఈ షో నిర్మాత సిద్దార్థబసు, అనిత తదితరులు పాల్గొన్నారు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments