Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్‌స్టార్‌ మహేష్‌ '1' (నేనొక్కడినే) 100 రోజులు

Webdunia
శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (20:43 IST)
WD
సూపర్‌స్టార్‌ మహేష్‌తో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై 'దూకుడు' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని నిర్మించిన రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర మళ్ళీ సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన '1(నేనొక్కడినే)' చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ అయింది. కొత్తదనంతో కూడుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో ఏప్రిల్‌ 19కి 100 రోజులు పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ - ''కొత్త కాన్సెప్ట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన మా '1' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా రిసీవ్‌ చేసుకోవడం, 100 రోజులు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. సూపర్‌స్టార్‌ మహేష్‌ నటన, సుకుమార్‌ డైరెక్షన్‌, దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ ఈ చిత్రాన్ని చాలా పెద్ద రేంజ్‌కి తీసుకెళ్ళాయి. ఈ చిత్రం ద్వారా మహేష్‌ కుమారుడు గౌతమ్‌ పరిచయం కావడం చాలా హ్యాపీగా వుంది. ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు, మహేష్‌ బాబు అభిమానులకు మా ధన్యవాదాలు'' అన్నారు.

తాటిపాక-పద్మప్రియ థియేటర్‌ యాజమాన్యం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ - ''మా థియేటర్‌లో మహేష్‌గారు నటించిన '1' చిత్రం రోజూ 4 ఆటలతో 100 రోజులు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. ఈ సందర్భంగా తాటిపాక ప్రేక్షకులకు, మహేష్‌ బాబు అభిమానులకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం'' అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుకుమార్‌.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments