Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార శేఖర కమ్ములకు సహకరించడం లేదట...

Webdunia
మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (18:09 IST)
WD
దర్శకడు శేఖర్‌ కమ్ముల 'అనామిక' అనే సినిమా తీశాడు. అది తమిళం, తెలుగులో తీస్తున్నట్లు చెబుతున్నాడు. కానీ తమిళ వెర్షన్‌ ఒరిజినల్‌. దాన్ని తెలుగులో డబ్‌ చేసి, కొన్ని సీన్స్‌ తెలుగువారితో చేయించాడని తెలుస్తోంది. ఈ చిత్రం విడుదల వాయిదాలు పడుతూ.. ఆఖరికి మే 1న సిద్ధమైంది. హిందీ 'కహాని' ఈ చిత్రానికి మూలం. ఇందులో నయనతార ప్రధాన పాత్ర పోషించింది. తన భర్త కనబడటంలేదని హైదరాబాద్‌ వస్తుంది.

టెర్రరిజం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఈ చిత్రం షూటింగ్‌ ఓల్డ్‌ సిటీలో చేశారు. సినిమా పూర్తయి పబ్లిసిటీ మొదలుపెడితే.. నయనతార సహకరించడం లేదని తెలుస్తోంది. అప్పటికే ఓసారి ప్రమోషన్‌ చేస్తే ఆమె రాలేదు. కొన్ని కారణాల వల్ల రాలేదని వేరే షూటింగ్‌ ఉందంటూ.. దర్శకుడు చెప్పారు. తాజాగా రెండురోజుల నాడే మరోసారి ఆడియో విడుదల కావాల్సి ఉంది.

కేవలం ఆమె రాకపోవడంతో వాయిదా పడింది. దాదాపు కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న ఈమె రాకపోవడంతో నిర్మాతలు దర్శకునిపై ఒత్తిడి తెస్తున్నారు. మే 1 లోపు ఆమెను తీసుకువచ్చి పబ్లిసిటీలో ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments