సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తోన్న 'ఆగడు' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రేపటితో ఈ షెడ్యూల్ పూర్తికానుంది. ఇందులో మహేష్ సరసన తమన్నా నటిస్తోంది.
పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్ మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. 'దూకుడు'కి మించి ఇందులో వినోదం వుంటుందని దర్శకుడు చెబుతున్నాడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో మహేష్ నటించిన దూకుడు, '1 నేనొక్కడినే' చిత్రాలను కూడా ఈ సంస్థే నిర్మించింది.